'నాతో బాడ్మింటన్ ఆడిన వారే నానమ్మను హత్య చేశారు': రాహుల్

రాజీవ్ గాంధీ హత్య జరిగిన 27 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Mar 12, 2018, 11:45 AM IST
'నాతో బాడ్మింటన్ ఆడిన వారే నానమ్మను హత్య చేశారు': రాహుల్

కౌలాలంపూర్: రాజీవ్ గాంధీ హత్య జరిగిన 27 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా నా తండ్రి హంతకులను పూర్తిగా క్షమించేస్తున్నాము' అని చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్న సగంతి తెలిసిందే..!

శనివారం సింగపూర్‌‌లో జరిగిన ఓ సమావేశంలో ఐఐఎం పూర్వ విద్యార్ధులతో మాట్లాడిన రాహుల్ గాంధీ, 'నేనూ, నా సోదరి (ప్రియాంక వాద్రా), మా తండ్రిని కడతేర్చిన హంతకులను క్షమించేస్తున్నాం. కారణం ఏదైనా కానీ, ఎలాంటి హింసను నేను ఇష్టపడను' అని ఆయన అన్నారు. తమ తండ్రి రాజీవ్ హత్య తర్వాత తమ కుటుంబం ఆ బాధ నుంచి కోలుకోవటానికి చాలా సమయం పట్టిందని ఆయన తెలిపారు.

 

 

ఇక ఇందిర, రాజీవ్‌ హత్యలపై రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో దుష్ట శక్తులతో పోరాడే సమయంలో.. మీరు ఓ వైపు నిలిచినప్పుడు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడా అదే జరిగింది. మా నాన్నమ్మ(ఇందిరా గాంధీ), తండ్రి(రాజీవ్ గాంధీ) ఆ క్రమంలోనే చనిపోయారు. అప్పటి పరిస్థితులను బట్టి వాళ్లు చనిపోతారని మా కుటుంబం ముందే ఊహించింది. తాను కూడా చనిపోతానని నాన్నమ్మ నాతో చెప్పేవారు. ఆమె అన్నట్లే ఆమెను హతమార్చారు. అది చూశాక మీరు కూడా చనిపోతారని నా తండ్రితో నేను చెప్పాను. ఊహించినట్టే జరిగింది’ అని రాహుల్‌ ఉద్వేగంగా ప్రసంగించారు.

అక్టోబర్ 1984లో ఇందిరా గాంధీ తన వెన్నంటే ఉండే బాడీగార్డుల చేతిలో మరణించారు. ఈ సంఘటన గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ, "నేను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నానమ్మ హత్యకు గురైంది. నానమ్మను హత్య చేసిన వారితో నేను బ్యాడ్మింటన్ ఆట అడేవాడిని. ఈ తరువాత నా తండ్రి కూడా హత్యచేయబడ్డారు. ఈ సంఘటనలు నన్ను ఎంతో బాధించాయి. ఇప్పుడైతే మీరు ఒక ప్రత్యేక వాతావరణంలో నివసిస్తున్నారు. ప్రతిరోజూ మీతో 15 మంది వ్యక్తులు ఉంటున్నారు. కానీ.. అలాంటి పరిస్థితుల్లో నివసించడం సులభం కాదు' అని అన్నారు.

డిసెంబరు 2017లో తల్లి సోనియా గాంధీ నుంచి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు ఈ అమేథీ ఎంపీ. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధినేతలుగా గాంధీ కుటుంబం బాధ్యతలు నిర్వహిస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ మూడు సంవత్సరాలకు పైగా ఆ పదవిలో ఉన్నారు. కుమార్తె ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్ మరణానంతరం భార్య సోనియా గాంధీ 19 సంవత్సరాలు ఏఐసీసీ అద్యక్షురాలిగా ఉన్నారు. ప్రస్తుతం అవే బాధ్యతలను రాహుల్ గాంధీ నిర్వర్తిస్తున్నారు.

Trending News