రాహుల్ పై ప్రియాంక గాంధీ ఆసక్తికర ట్వీట్

రాహుల్ గాంధీపై సోదరి ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదకగా ద్వార తన బావోద్వేగాన్ని ప్రదర్శించారు

Last Updated : Apr 4, 2019, 09:54 PM IST
రాహుల్ పై ప్రియాంక గాంధీ ఆసక్తికర ట్వీట్

దక్షిణాదిలో పట్టు సాధించేందుకు రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఈ రోజు తన సోదరి ప్రియాంకతో కలిసి వయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. 

రాహుల్ నామినేషన్ అనంతరం ప్రియాంకాగాంధీ భావోద్వేగ ట్వీట్ చేశారు. 'నా సోదరుడు రాహుల్ నాకు నిజమైన మిత్రుడు.. నాకు తెలిసినంత వరకు అతను చాలా ధైర్యవంతుడు. వయనాడ్‌ ప్రజలారా.. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచడు అంటూ ప్రియాంక భావోద్వేగ ట్వీట్ చేశారు

Trending News