దేశంలోనే పెద్ద బఫూన్ రాహుల్ గాంధీ : కేసీఆర్

రాహుల్ గాంధీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సెటైర్లు 

Last Updated : Sep 7, 2018, 02:01 PM IST
దేశంలోనే పెద్ద బఫూన్ రాహుల్ గాంధీ : కేసీఆర్

దేశంలోనే ఓ పెద్ద బఫూన్ ఎవరైనా ఉన్నారా అంటే అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనేనని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ శాసనసభ రద్దు అనంతరం రాష్ట్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీని హత్తుకుని కన్నుకొట్టిన తీరు ఎలా ఉందో యావత్ దేశం అంతా చూసిందని చెబుతూ సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలుచేశారు. రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నిసార్లు పర్యటిస్తే, అంత ఎక్కువ రెట్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలుంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు.

 

Trending News