• 542/542 TARGET 272
  • BJP+

    355BJP+

  • CONG+

    88CONG+

  • OTH

    99OTH

Full coverage

రాహుల్ గాంధీ విమానం ఇంజన్‌లో తలెత్తిన లోపం.. వీడియో

రాహుల్ గాంధీ విమానం ఇంజన్‌లో తలెత్తిన లోపం.. వీడియో

Updated: Apr 26, 2019, 04:11 PM IST
రాహుల్ గాంధీ విమానం ఇంజన్‌లో తలెత్తిన లోపం.. వీడియో

ఢిల్లీ: రాహుల్ గాంధీ ప్రయాణిస్తోన్న ప్రత్యేక విమానం ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా విమానాన్ని ఢిల్లీకి తిరిగి దారి మళ్లించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి పాట్నాకు బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, తాము తప్పనిసరి పరిస్థితుల్లో వెనుదిరిగి వాళ్లాల్సి వచ్చిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ కారణంగా సమస్తిపూర్ (బీహార్), బాలాసోర్ (ఒడిషా), సంగంనేర్ (మహారాష్ట్ర)లో నేడు జరగాల్సి వున్న ఎన్నికల ప్రచార సభలు ఆలస్యమవుతాయని, ఆ ఆలస్యానికి అందరూ తనని క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్టు రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందడానికి సాక్ష్యంగా రాహుల్ గాంధీ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.