Rajasthan Crisis: సుప్రీంకోర్టులో వెనక్కి తగ్గిన రాజస్థాన్ ప్రభుత్వం

రాజస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని ఈ విధానంలో ఎదుర్కోలేమని భావించిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెనక్కి తగ్గింది. స్పీకర్ సీపీ జోషి (Rajasthan Assembly Speaker CP Joshi) తన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఉపసంహరించుకున్నారు.

Last Updated : Jul 27, 2020, 12:27 PM IST
Rajasthan Crisis: సుప్రీంకోర్టులో వెనక్కి తగ్గిన రాజస్థాన్ ప్రభుత్వం

న్యూఢిల్లీ: రాజస్థాన్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కాస్త వెనక్కి తగ్గింది. సుప్రీంకోర్టులో తాను వేసిన వేసిన పిటిషన్‌ను రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి సోమవారం (జులై 27) నాడు ఉపసంహరించుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో పాటు మరో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ సీపీ జోసి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. Rajasthan: సచిన్ పైలట్ వర్గానికి ఊరట

రాజస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని ఈ విధానంలో ఎదుర్కోలేమని భావించిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెనక్కి తగ్గింది. చట్టపరంగా తమ నిర్ణయానికి మద్దతు లభించే అవకాశం లేకపోవడంతో రాజకీయంగానే సచిన్ పైలట్, 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ దిశలు పావులు కదపడంలో భాగంగా రాజస్థాన్ స్పీకర్ సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. Nithin Wedding Photos: హీరో నితిన్, షాలినిల పెళ్లి వేడుక ఫొటోలు

డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్ పైలట్, తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఇటీవల కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబావుగా ఎగురవేశారు. పార్టీ పెద్దలు బుజ్జగించినా మనసు మార్చుకోలేదు. పైగా రాజస్థాన్ కాంగ్రెస్ సీఎల్పీ సమావేశాలకు హాజరుకాని పక్షంలో సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలను పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అధిష్టానం తొలగించింది. మరోవైపు ఈ సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ సీపీ జోషి నోటీసులు జారీ చేయడం తెలిసిందే. Rajasthan: కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంత్యాక్షరి.. వీడియో వైరల్

పార్టీ సమావేశాలకు హాజరుకాని పక్షంలో అనర్హత వేయడాన్ని సచిన్ పైలట్, మరో 18 మంది ఎమ్మెల్యేలు దీన్ని రాజస్థాన్ హైకోర్టులో సవాల్ చేశారు. అనర్హత నోటీసులపై కోర్టు స్టే విధించింది. దీంతో స్పీకర్ సీపీ జోషి హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం మరోసారి విచారణ చేపడుతుండగా.. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు స్పీకర్ జోషి తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.  బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..   వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్ 

Trending News