Revanth Reddy: రాబోయే ఎన్నికల్లో ఆ స్థానం నుంచే రేవంత్‌ రెడ్డి పోటీ చేయనున్నారా..?

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ జోరు పెంచారా..? మళ్లీ కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యే పోటీ చేయనున్నారా..? గతేడాది జరిగిన పరాజయానికి బదులు తీర్చుకోనున్నారా..? ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏం చెబుతున్నాయి..?

Written by - Alla Swamy | Last Updated : Sep 26, 2022, 09:08 PM IST
  • తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ జోరు
  • ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం
  • పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ
Revanth Reddy: రాబోయే ఎన్నికల్లో ఆ స్థానం నుంచే రేవంత్‌ రెడ్డి పోటీ చేయనున్నారా..?

Revanth Reddy: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్నలక్ష్యంతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇందులోభాగంగానే క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. అంతకంటే ముందు మునుగోడును స్వీప్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ప్రచారాన్ని ఉధృతం చేశారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పోటీ చేయనున్నారు. నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని యోచిస్తున్నారు.

ఇటు వచ్చే ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. రాబోయే ఎన్నికల్లో ఆయన కొడంగల్‌ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ జోరు పెంచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. తాజాగా కొడంగల్‌లో చేరికలు ఊపందుకున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు భారీగా హస్తం పార్టీలో చేరుతున్నారు. టీపీసీపీ చీఫ్‌ రేవంత్‌ సమక్షంలో మద్దూరు మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఈసందర్భంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్దూరు, గోకుల్ నగర్, సీతనాయక్ తండా నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నామన్నారు. కొడంగల్‌లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని..ఇప్పుడున్న ప్రజాప్రతినిధి ఏ సమస్యను పరిష్కరించలేదన్నారు. కొడంగల్ ప్రజలు అభివృద్ధి చేసే పార్టీలనే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. 

కొడంగల్‌ను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని..సోనియా గాంధీ సైతం ఇదే ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కలిసి కొడంగల్‌కు రావాల్సిన అభివృద్ధి పనులను ఆపారని మండిపడ్డారు. కృష్ణా-వికారాబాద్ రైలు ఎందుకు నిలిపివేశారో చెప్పాలన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 5 వేల ట్రాన్స్ ఫార్మర్లు తెచ్చి ..ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశామన్నారు. మళ్లీ అలాంటి అభివృద్ధి జరగాలంటే తనను గెలిపించాలని కోరారు. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీనిచ్చారు. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం రేవంత్‌..కొడంగల్‌ నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు పక్కగా పావులు కదుపుతున్నారు. తనను టార్గెట్‌ చేసి సీఎం కేసీఆర్ ఓడించారని గతంలో రేవంత్‌ రెడ్డి పలుమార్లు తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాల్కాజ్‌ గిరి నుంచి ఆయన ఎంపీగా గెలిచారు.

ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. రాబోయే ఎన్నిల్లో కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డియే ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ కార్యకర్తలు సైతం అదే చెబుతున్నారు. మరి కొడంగల్ స్థానం ఆయనకు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

Also read:Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం..మరో రెండు గంటలపాటు బీఅలర్ట్..!

Also read:SCR: దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..!    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News