Sabarmati-Agra Train: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన నాలుగు బోగీలు.. వైరల్ వీడియో..

Express Derail Near Ajmer: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. అజ్మీర్ సమీపంలో సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది.  సబర్మతి-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రైలు అవతలి వైపు నుంచి వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టిడం వల్ల ఈ ఘటన జరిగినట్లు సమాచారం.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 18, 2024, 11:25 AM IST
  • అజ్మీర్ వద్ద రైలుప్రమాదం..
  • పట్టాలు తప్పిన సబర్మతి-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రైలు..
 Sabarmati-Agra Train: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన నాలుగు బోగీలు.. వైరల్ వీడియో..

Rajasthan Sabarmati-Agra Super Fast Train Derail: రైల్వేశాఖ ఎంత అప్రమత్తంగా ఉన్న రైలు ప్రమాదాలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల రైలు ప్రమాద ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కొన్నిచోట్ల రైలు పట్టాలను తప్పడం వల్ల రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొన్నిచోట్ల రైళ్లలో టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనల వల్ల కూడా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆకతాయిలు కూడా కొన్నిసార్లు పట్టాలపైన రాళ్లు పెట్టడం లేదా పట్టాలను ధ్వంసం చేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి సందర్భలలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్చం ఇలాంటి రైలు ప్రమాద ఘటన వార్తలలో నిలిచింది.

 

పూర్తివివరాలు.. 

రాజస్థాన్ లోని అజ్మీర్ స్టేషన్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.  సోమవారం ఉదయం సబర్మతి-ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పడంతో అందులో ఉన్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వెంటనే రైలులో ఉన్న ప్రయాణికులు ఆందోళనలకు గురయ్యారు. వెంటనే రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన స్థలానికి చేరుకుని అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికంగ ఉన్న అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎక్స్‌ప్రెస్ రైలు ఆగ్రాకు వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో పట్టాలు తప్పింది. ప్యాసింజర్ రైలు ఇంజన్ సహా నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయని వారు తెలిపారు.

రైలు అజ్మీర్‌ స్టేషన్‌ దాటి మదర్‌ స్టేషన్‌కు చేరుకోనున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శశి కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఢిల్లీ వైపు నుంచి రైలు రాకపోకలను పునరుద్ధరించామని అధికారులు తెలిపారు.

Read More: Snake Venom Rave Party: పాముల విషంతో రేవ్ పార్టీ.. బిగ్ బాస్ OTT 2 విన్నర్ అరెస్టు..

NWR అజ్మీర్ స్టేషన్‌లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. రైలులో ప్రయాణించే ప్రయాణీకుల బంధువుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ - 0145-2429642 ను కూడా విడుదల చేసింది, అధికారి తెలిపారు.ఆరు రైళ్లను రద్దు చేశామని, రెండు రైళ్లను ఇతర మార్గాలకు మళ్లించామని కిరణ్ తెలిపారు. రైలు పట్టాలు తప్పడానికి గల ఖచ్చితమైన కారణం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News