కావేరీ నదీ జలాల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఈ తీర్పు నిరాశపరిచిందని, దీని ప్రభావంతో రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని, తమిళనాడు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ఈ తీర్పు పునఃపరిశీలన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని తన ట్వీట్‌లో రజనీ కోరారు.
காவிரி நீர் பங்கீட்டில் உச்சநீதிமன்றத்தின் இறுதி தீர்ப்பு தமிழக விவசாயிகளின் வாழ்வாதாரத்தை மேலும் பாதிப்பதாக உள்ளதால் மிகுந்த ஏமாற்றமளிக்கிறது.மறு பரிசீலனை மனு தாக்கல் செய்ய தமிழகஅரசு நடவடிக்கை எடுக்க வேண்டும்.
— Rajinikanth (@superstarrajini) February 16, 2018
కాగా, తమిళనాడుకు న్యాయబద్ధంగా ఏటా 177.25 టీఎంసీలు కేటాయిస్తూ, కర్నాటకలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా అదనంగా 14.75 టీఎంసీల నీటిని ఆ రాష్ట్రం వాడుకోవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
'కావేరీ' తీర్పు నిరాశ పరిచింది: రజినీకాంత్