సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం .. ట్రంప్ పర్యటనపై తొలి ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ. . ఆయన పర్యటకు లక్షల మంది రావాలంటే .. అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్ లాంటి వారిని పిలవాలన్నారు. ఇప్పుడు తాజాగా భారత్ లో ట్రంప్ అడుగు పెట్టే ముందు ఆయన కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్న అంశంపై మరో ట్వీట్ వదిలారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. విమానాశ్రయంలో దిగగానే ఆయన్ను కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో స్వాగతించాలని నిర్ణయించారు. దీనిపై వివాదాస్పద దర్శకుడు వర్మ స్పందించారు. అలాంటి సాంస్కృతిక ప్రదర్శనలు చూసే సమయంలో ట్రంప్ ముఖ కవళికలు చూడాలని ఉందని ట్వీట్ చేశారు. అప్పుడు ఆయన చాలా బోర్ గా ఫీలవుతారంటూ ట్వీట్ పోస్ట్ చేశారు.
Dying to see @realdonaldtrump ‘s facial expressions while he’s watching our cultural programmes ..Knowing him , he will be bored to death ..Just saying!
— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2020