పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రంగోలితో రంగంలోకి..

పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే దాదాపు పక్షం రోజులుగా నిరసన జ్వాలలతో దేశంలోని పలు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిరసనలు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను కూడా రద్దు చేసింది. చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి.. వీలైనంత మేర నిరసనలను తగ్గించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Last Updated : Dec 30, 2019, 09:11 AM IST
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రంగోలితో రంగంలోకి..

పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే దాదాపు పక్షం రోజులుగా నిరసన జ్వాలలతో దేశంలోని పలు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిరసనలు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను కూడా రద్దు చేసింది. చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి.. వీలైనంత మేర నిరసనలను తగ్గించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐతే  చాలా రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు పౌరసత్వ సవరణ చట్టం CAA-2019కు వ్యతిరేకంగా తమదైన పంథాలో ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దక్షిణాదిలో కొత్త రకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

స్టాలిన్  ఇంటి ముందు నిరసన ముగ్గు

తమిళనాడులో ప్రస్తుతం పొంగల్ పండగ  సీజన్ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దడం ఆనవాయితీ. ఐతే దీన్ని కూడా పౌరసత్వ సవరణ చట్టం CAA-2019కు వ్యతిరేకంగా ఉద్యమించడానికి ఆందోళనకారులు వాడుకుంటున్నారు.  CAA-2019 చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి దృశ్యాలు చాలా ఇళ్ల ముందు దర్శనమిస్తున్నాయి. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ ఇంటి ముందు కూడా ఇలాంటి  రంగవల్లులే కనిపించాయి. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ జాబితా, జాతీయ పౌర గణన పట్టికను వ్యతిరేకిస్తూ స్టాలిన్ ఇంటి ముందు ముగ్గులను తీర్చిదిద్దారు. దీన్నిబట్టి పౌరసత్వ సవరణ చట్టం-2019ను తాము ఎంతగా వ్యతిరేకిస్తున్నామో చెప్పేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News