Gujarat లో 1000 బెడ్స్‌తో కొవిడ్ హాస్పిటల్ నిర్మించనున్న Reliance foundation

Reliance foundation's COVID-19 hospital in Gujarat: గాంధీ నగర్: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 1000 పడకలతో ఆక్సీజన్ సౌకర్యాలతో కూడిన కొవిడ్-19 ఆస్పత్రిని నిర్మించనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. గుజరాత్‌లోనే కాకుండా ఇంకొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా రిలయన్స్ ఆక్సీజన్ సరఫరా (Oxygen supply) చేస్తున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ఈ ప్రకటనలో పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2021, 05:03 AM IST
Gujarat లో 1000 బెడ్స్‌తో కొవిడ్ హాస్పిటల్ నిర్మించనున్న Reliance foundation

Reliance foundation's COVID-19 hospital in Gujarat: గాంధీ నగర్: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 1000 పడకలతో ఆక్సీజన్ సౌకర్యాలతో కూడిన కొవిడ్-19 ఆస్పత్రిని నిర్మించనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. ఇదే విషయమై గుజరాత్ ముఖ్యమంత్రిత్వ కార్యాలయం ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కొవిడ్ హాస్పిటల్ నిర్మాణానికి రిలయన్స్ ఫౌండేషన్ (Reliance foundation) ముందుకు వచ్చినట్టు తెలిపింది. 

మే 2వ తేదీనాటికి తొలి దశలో భాగంగా 400 పడకలతో కొవిడ్-19 హాస్పిటల్ అందుబాటులోకి రానుందని వెల్లడించిన గుజరాత్ సీఎంవో.. '' సౌరాష్ట్రలోని జామ్‌నగర్, ద్వారకా, పోర్బందర్ జిల్లాల నుంచి వచ్చే కరోనా రోగులకు ఈ ఆస్పత్రి ఎంతో ఉపయోగపడుతుంది'' అని అభిప్రాయపడింది. మరో రెండు వారాల్లో మరో 600 పడకలు, ఆక్సీజన్ సౌకర్యాలతో కూడిన కొవిడ్ కేర్ సెంటర్ నిర్మాణం పూర్తవుతుందని రిలయన్స్ ఫౌండేషన్ పేర్కొంది. 

Also read : CSK vs SRH match highlights: గైక్వాడ్, డుప్లెసిస్ దూకుడు.. హైదరాబాద్‌పై చెన్నై విజయం

రిలయన్స్ ఫౌండేషన్ నిర్మించతలపెట్టిన కొవిడ్ ఆస్పత్రికి (COVID-19 hospital in Gujarat) అవసరమైన సిబ్బంది, మెడికల్ సపోర్ట్, వైద్య పరికరాలతో పాటు అన్నిరకాల వైద్య సేవలకు అయ్యే ఖర్చులను ఫౌండేషన్ భరించనుందని రిలయన్స్ స్పష్టంచేసింది. ఆస్పత్రికి అవసరమైన డాక్టర్లు, నర్సులు విషయంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయం చేసుకోనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ పేర్కొంది. 

గుజరాత్‌లోనే కాకుండా ఇంకొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా రిలయన్స్ ఆక్సీజన్ సరఫరా (Oxygen supply) చేస్తున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ఈ ప్రకటనలో పేర్కొంది. ముంబైలో 875 పడకలతో రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో ఉచితంగా కరోనా చికిత్స అందిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. గుజరాత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 14,120 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించగా, 174 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు గుజరాత్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 5,38,845 కి (COVID-19 cases in Gujarat) చేరింది.

Also read : COVID-19 నుంచి రికవరీ అయినవాళ్లు తీసుకోవాల్సిన Food, ఇతర జాగ్రత్తలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News