ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ధరల సమీక్ష అనంతరం ఢిల్లీలో ఇవాళ పెట్రోల్ 22 పైసలు, డీజిల్ 23 పైసలు పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ రూ.80.73, డీజిల్ రూ .72.83గా ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.88.12, డీజిల్ రూ .77.32గా ఉంది.
మరోవైపు పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ... కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు పిలుపునకు మొత్తం 21 పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గించేందుకు కేంద్రం ముందుకు రాకపోవడం వల్లే ధరలు పెరిగిపోతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బంద్ కారణంగా కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
Security has been tightened in Jaipur over #BharatBandh. Police says, "Precautionary measures have been taken. Police have been directed to take stringent actions against the protesters who will restore to violence during protests." #Rajasthan pic.twitter.com/DWbxHRYPxK
— ANI (@ANI) September 10, 2018
Odisha: Congress workers block a train in Sambalpur as #BharathBandh has been called by Congress and other opposition parties today over fuel price hike pic.twitter.com/7rXobOCT7L
— ANI (@ANI) September 10, 2018
Jan Adhikar Party Loktantrik workers block railway tracks in Patna's Rajendra Nagar Terminal railway station in support to #BharatBandh that has been called by Congress and other opposition parties today over fuel price hike. pic.twitter.com/tFTmCOrXqe
— ANI (@ANI) September 10, 2018
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్, వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో బంద్ నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల్లో వామపక్ష నాయకులు ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. ఏపీల వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతు ఇస్తున్నాయి. వామపక్షాలు, జనసేన ఆధ్వర్యంలో నాయకులు బస్టాండ్ల వద్ద శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. రాయలసీమ యూనివర్సిటీలో ఇవాళ్టి సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేశారు.
CPI and CPM workers in Andhra Pradesh's Vijayawada hold protest against fuel price hike. #BharathBandh pic.twitter.com/MbElm9sdmU
— ANI (@ANI) September 10, 2018
#BharathBandh: CPI(M) holds protest in #AndhraPradesh's Visakhapatnam against fuel price hike pic.twitter.com/qPLBF152Cl
— ANI (@ANI) September 10, 2018
తెలంగాణలో కూడా ఇంధన ధరల పెంపును నిరసిస్తూ.. భువనగిరిలో, హైదరాబాద్ ముషీరాబాద్ బస్ డిపో వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, నాగర్‌కర్నూల్, నల్గొండ, హన్మకొండలలో వామపక్షాలు ఆందోళనలకు దిగాయి. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల నేతలు బస్ డిపోల వద్ద నిరసన తెలుపుతూ బస్సులను అడ్డుకుంటున్నారు.
Telangana: Congress workers hold protests in Yadadri Bhuvanagiri district's Bhongir (pic 1) and Musheerabad bus depot (pic 2) in Hyderabad, against fuel price hike #BharatBandh pic.twitter.com/cVoIXXJbNr
— ANI (@ANI) September 10, 2018
ఇక తమిళనాడు, బీహార్, ఢిల్లీ. మహారాష్ట్రలో బంద్ ప్రభావం తీవ్రంగా ఉండగా.. మిగిలిన రాష్ట్రాల్లో పాక్షికంగా బంద్ ప్రభావం కనిపిస్తోంది. బంద్ దృష్ట్యా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు.
గుజరాత్‌లోని బరూచిలో నిరసనకారులు రోడ్లపై టైర్టు పడేసి తగులబెట్టారు. బస్సులను ఎక్కడికక్కడ ఆపేశారు. ట్రాఫిక్ నిలిచిపోయింది.
#BharathBandh: Protesters in Gujarat's Bharuch burn tyres and stop buses; traffic movement halted pic.twitter.com/G6b9OFNXg5
— ANI (@ANI) September 10, 2018
ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులతో కలిసి రాజ్ ఘాట్ నుంచి రామ్ లీలా మైదాన్ వరకు వెళ్లి ఇంధన ధరల పెంపుపై నిరసన తెలిపారు.
Delhi: Congress President Rahul Gandhi and opposition party leaders march from Rajghat towards Ramlila Maidan, to protest against fuel price hike. #BharatBandh pic.twitter.com/X7DQcVRgIA
— ANI (@ANI) September 10, 2018
ఒడిశా సంబల్‌పూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైల్‌రోకో నిర్వహిస్తున్నారు. కోల్‌కతాలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈశాన్య కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NEKRTC) కూడా 'భారత్ బంద్' కారణంగా నేడు బస్సు సేవలను ఆపేసాయి.
Kalaburagi: Bus services of North Eastern Karnataka Road Transport Corporation (NEKRTC) aren't operational today as #BharathBandh has been called by Congress and other opposition parties against fuel price hike. #Karnataka pic.twitter.com/raLOb95uuR
— ANI (@ANI) September 10, 2018