Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలకు కారణమేంటి

Cryptocurrency: డిజిటల్ కరెన్సీకు ప్రతిరూపంగా మారిన క్రిప్టోకరెన్సీ దేశంలో క్రమక్రమంగా విస్తరిస్తోంది. దేశ ఆర్ధిక వ్యవస్థలో క్రిప్టోకరెన్సీపై నిర్దిష్ట వ్యూహం లేకపోవడంతో ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దసరా వేళ క్రిప్టోకరెన్సీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2021, 06:56 AM IST
  • క్రిప్టోకరెన్సీపై ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ కీలకమైన వ్యాఖ్యలు
  • దసరా వేళ క్రిప్టోకరెన్సీ, ఓటీటీ కంటెంట్, డ్రగ్స్ వినియోగంపై మాట్లాడిన మోహన్ భగవత్
  • ఇండియాలో విస్తరిస్తున్న క్రిప్టోకరెన్సీని నియంత్రించేది ఎవరంటూ ప్రశ్న
Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలకు కారణమేంటి

Cryptocurrency: డిజిటల్ కరెన్సీకు ప్రతిరూపంగా మారిన క్రిప్టోకరెన్సీ దేశంలో క్రమక్రమంగా విస్తరిస్తోంది. దేశ ఆర్ధిక వ్యవస్థలో క్రిప్టోకరెన్సీపై నిర్దిష్ట వ్యూహం లేకపోవడంతో ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దసరా వేళ క్రిప్టోకరెన్సీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇండియాలో క్రిప్టోకరెన్సీ(Cryptocurrency) వ్యవహారంపై ఆర్ఎస్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో క్రమక్రమంగా విస్తరిస్తున్న క్రిప్టోకరెన్సీను ప్రభుత్వం నియంత్రించాలంటూ ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ డిమాండ్ చేశారు. విజయదశమి పురస్కరించుకుని నాగ్‌పూర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో క్రిప్టోకరెన్సీ గురించి మాట్లాడటం విశేషం. దసరా పండుగ నాడు ఓటీటీ కంటెంట్, డ్రగ్స్ వినియోగం, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు వంటి అంశాలపై మాట్లాడారు. క్రిప్టోకరెన్సీపై ఆందోళన వ్యక్తం చేశారు. బిట్ కాయిన్స్‌ను ఏ దేశం, ఏ ఆర్ధిక వ్యవస్థ నియంత్రించగలదో తెలియడం లేదని మోహన్ భగవత్(Mohan Bhagwat) తెలిపారు. క్రిప్టోకరెన్సీను నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని..అప్పటివరకూ ఏం జరుగుతుందనేదే ఆందోళన కల్గిస్తోందని చెప్పారు. 

ఇండియాలో ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ ప్రాచుర్యం పెరుగుతోంది. మరో రెండు మూడేళ్లల యూరప్‌ను సైతం వెనక్కి నెట్టే పరిస్థితి కన్పిస్తోంది. అమెరికాను మించి ఇండియాలో క్రిప్టోకరెన్సీ ప్రాచుర్యం పెరుగుతోంది. యువతలో క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ క్రేజ్ పెరుగుతోంది. జిల్లా కేంద్రాల్లో అయితే బిట్ కాయిన్(Bitcoin), ఈథర్‌నెట్ వంటి కాయిన్లు వర్చువల్‌గా చలామణీ అవుతున్నాయి. క్రిప్టోకరెన్సీ వ్యవస్థపై ప్రభుత్వానికి ఇంకా నిర్ధిష్ట విధానం లేదు. మరోవైపు క్రిప్టోకరెన్సీ భద్రతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ మార్కెట్‌లో మనుషుల పెత్తనం, ప్రభుత్వ నియంత్రణ ఉండటంతో శక్తివంతమైన వ్యక్తులు ప్రభావితం చేసే అవకాశాలుంటాయి. అయితే క్రిప్టోకరెన్సీ పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఇక్కడ మనుషులు, ప్రభుత్వాల పాత్ర నామమాత్రమే. ఇందులో పెట్టుబడి పెట్టే డబ్బుకి ఎటువంటి చట్టబద్దథ లేదు. అందుకే క్రిప్టోకరెన్సీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Also read: UP Accident: యూపీలో విషాదం...ట్రాక్టర్ బోల్తాపడి 11మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News