Sabarimala Huge Rush Continous: కేరళలోని శబరిమలలో నెలకొని ఉన్న అయ్యప్ప దేవస్థానానికి ప్రతి ఏడాది నవంబర్ లో భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ఏడాదిలో దాదాపు అన్ని రోజులపాటు ఈ దేవాలయం మూసే ఉంచుతారు కానీ నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు మండల పూజల కోసం ఆలయాన్ని తెరుస్తారు. గతంలో కేవలం ఈ 41 రోజులు పాటు మాత్రమే ఆలయం తెరిచేవారు తర్వాత మాస పూజల నిమిత్తం నెలలో ఐదు రోజుల పాటు ఆలయాన్ని తెరుస్తూ వస్తున్నారు. అయితే గత రెండేళ్ల నుంచి కరోనా నేపథ్యంలో అయ్యప్ప దర్శనానికి పెద్ద ఎత్తున ఆంక్షలు ఏర్పరిచిన నేపథ్యంలో రెండేళ్ల నుంచి అయ్యప్పను దర్శించుకోలేక పోయామనే ఉద్దేశంతో ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేసిన క్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులుమాలధారణ చేసి శబరిమలై బయలుదేరి వెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దీంతో పెద్ద ఎత్తున శబరిమలలో రద్దీ కనిపిస్తోంది. సాధారణంగా నాలుగున్నర కిలోమీటర్ల దూరం ఉండే మార్గాన్ని కూడా 10 గంటల సమయంలో కూడా చేరుకోలేకపోతున్నారు అంటే ఎంత రద్దీగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అక్కడ అయ్యప్ప దర్శనానికి సమయం పడుతూ ఉండటం, నెయ్యాభిషేకానికి సమయం పడుతూ ఉండటం లాంటి అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉండడంతో గంటల తరబడి అయ్యప్పలు క్యూ లైన్ లో పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ విషయం మీద కేరళ హైకోర్టు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తూ వస్తుంది.
భుత్వం కూడా తమ తరఫున ఎలాంటి బాధ్యతలు తీసుకుంటున్నాము? అక్కడి రద్దీని కంట్రోల్ చేయడానికి ఎలాంటి బాధ్యతలు తీసుకుంటున్నామనే విషయాన్ని కూడా కోర్టు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడి రద్దీ మాత్రం తగ్గకపోవడం బాధాకరమైన విషయం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. తాజాగా శబరిమల రద్దీని నియంత్రించేందుకు నిన్న ప్రభుత్వ స్థాయిలో జరిగిన సమావేశం నిర్ణయాలను పొందుపరిచి పతనంతిట్ట జిల్లా కలెక్టర్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు.
వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా బుకింగ్‌ల సంఖ్యను రోజుకు 90 వేలకు పరిమితం చేయడం, దర్శనం సమయాలను 19 గంటలకు పెంచడం వంటి ప్రతిపాదనలను కలెక్టర్ సమర్పించారు. మరోపక్క శబరిమల వద్ద రద్దీని నియంత్రించేందుకు జిల్లా పోలీసు చీఫ్ కూడా కొన్ని ప్రతిపాదనలను కోర్టులో సమర్పించారు. జిల్లా కలెక్టర్ల అనుమతితో ఎరుమేలి, పతనంతిట్ట, కొట్టాయం సమీప ప్రాంతాలలో యాత్రికుల వాహనాలను పరిమితం చేయడం వంటి ప్రతిపాదనలను కోర్టు ముందు ఉంచారు.
ఈ ప్రతిపాదనలపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు, అమికస్ క్యూరీ, శబరిమల స్పెషల్ కమిషనర్‌ల అభిప్రాయాలను హైకోర్టు కోరింది. ఈ పిటిషన్లపై ఇవాళ మరోసారి కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌ను జస్టిస్ అనిల్ కె నరేంద్రన్, జస్టిస్ పిజి అజిత్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తోంది.
Also Read: Kriti Sanon Pics: ఓ మై గాడ్ అనిపిస్తున్న సీత అందాలు.. ఆలస్యం చేయకుండా హాట్ స్టిల్స్ చూసేయండి!
Also Read: waltair Veerayya Boss Party : పరుగులో ఆగిన బాలయ్య.. దూసుకుపోతోన్న చిరంజీవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook