నేటి నుంచి ఆ కార్డులపై సర్వీసులు రద్దు

కొందరు వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో నేటి (మార్చి 16) నుండి ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం కుదరదు. ఈ సౌకర్యాన్ని RBI నేటి నుంచి నిలిపివేసింది. 

Last Updated : Mar 16, 2020, 07:50 AM IST
నేటి నుంచి ఆ కార్డులపై సర్వీసులు రద్దు

న్యూడిల్లీ: మీ వద్ద SBI లేక ఇతర బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులున్నాయా. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కొందరు వినియోగదారులు తమ కార్డులతో నేటి (మార్చి 16) నుండి ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం కుదరదు. ఈ సౌకర్యాన్ని నేటి నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిలిపివేసింది. ఈ విషయంపై కార్డుదారులను ఈ ఏడాది జనవరి నెలలోనే ఆర్బీఐ హెచ్చరించింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. నేటి నుంచి పని చేయని కార్డుల వివరాలపై ఓ లుక్కేయండి.

EPFO కొత్త రూల్.. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..

ఆన్‌లైన్ మోసాలను అరికట్టడం, కార్డుదారుల సెక్యూరిటీని పెంచే క్రమంలో ఆర్బీఐ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అవి నేటి నుంచి అమలులోకి రానున్నాయి. వినియోగదారులు తమ వద్ద ఉన్న డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో మార్చి 15వ తేదీవరకు కనీసం ఒక్కసారైనా ఆన్ లైన్ లేక కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ చేయాలి. లేని పక్షంలో ఆ క్రెడిట్, డెబిట్ కార్డులపై మార్చి 16వ తేదీ నుంచి ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ సౌకర్యాన్ని నిలిపివేస్తున్నారు. 

Also Read: శుభవార్త.. ఉద్యోగులకు ఆ కష్టం ఉండదు

(మార్చి 15) నిన్నటివరకూ కనీసం ఒక్కసారైనా ఆన్ లైన్, కాంటాక్ట్ లెస్ సర్వీస్‌కు వినియోగించని కార్డులను ఇక ఆన్ లైన్, కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ల సర్వీస్ రద్దు చేశారు. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ లోని సెక్షన్ 10 (2) ప్రకారం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు

డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ట్రాన్సాక్షన్స్ సమయంలో సెక్యూరిటీ పెంచడంతో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు తరచుగా క్రెడిట్ లేక డెబిట్ కార్డులను కాంటాక్ట్ లెస్ సర్వీస్‌కు కనీసం ఒక్కసారైనా వినియోగిస్తేనే వారి కార్డులకు సంబంధించి భద్రత కల్పంచడం తేలిక అవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.  రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (RFID) టెక్నాలజీ ఆధారంగా ఈ కార్డులు పనిచేస్తాయని తెలిసిందే.

Also Read: 30 రోజుల్లో జాబ్ రాకపోతే.. 75 శాతం పీఎఫ్ విత్‌డ్రా 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News