దేశంలో అతి పెద్ద బ్యాంకింగ్ సంస్థగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ వినిపించింది. అయితే, ఈ గుడ్ న్యూస్ కేవలం ఫిక్స్‌డ్ డిపాజిట్ కలిగిన ఖాతాదారులకు మాత్రమే వర్తించనుంది. వివిధ కాల పరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో10 బేసిస్ పాయింట్స్(ఒక బేసిస్ పాయింట్ 0.01 శాతంతో సమానం) పెంచుతున్నట్టు ఎస్బీఐ స్పష్టంచేసింది. 

ఏడాది నుంచి రెండేళ్ల మధ్య కాల పరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రస్తుతం వడ్డీ రేటు6.65గా ఉండగా ఆ రేటుని 6.7కు పెంచుతున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. అలాగే ప్రస్తుతం వృద్ధులకు వారి డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీ రేటును 7.15 నుంచి 7.2 శాతానికి పెంచినట్టు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 
 

English Title: 
SBI Increases interest rate on fixed deposits upto 0.10 Percentage Points
News Source: 
Home Title: 

ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్

ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్

Trending News