అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు డెడ్ లైన్ ; డబ్బు చెల్లించకుంటే జైలు శిక్షే

                                                         

Last Updated : Feb 20, 2019, 01:09 PM IST
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు డెడ్ లైన్ ; డబ్బు చెల్లించకుంటే జైలు శిక్షే

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎరిక్‌సన్‌ సంస్థ బకాయిలను  నాలుగు వారాల్లో చెల్లించాలని ధర్మాసనం గడవు విధించింది. ఈ గడువులోపు డబ్బు చెప్పించని పక్షంలో మూడు జైలు శిక్షి అనుభవించేందుకు సిద్దాంగా ఉండాలని ధర్మాసనం హెచ్చరించింది.

అనీల్ అంబానీ ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన క్రమంలో ఎరిక్సన్‌ తరపున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదిస్తూ అంబానీ వద్ద రఫెల్‌ కోసం..ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు డబ్బులు ఉంటాయి. కానీ మాకు చెల్లించడానికి మాత్రం ఉండవు. న్యాయస్థానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని వాదించారు. కాగా అనిల్‌ అంబానీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. 

ఎరిక్సన్‌ తరఫున చేసిన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తులు అనిల్‌ అంబానీకి మూడు నెలల గడువు విధించారు. గడువులోగా కచ్చితంగా డబ్బు డిపాజిట్‌ చేయాల్సిందేనని.. లేదంటే శిక్ష తప్పదని హెచ్చరించింది. ఇదే సందర్భంలో అనిల్‌ అంబానీని వెంటనే అరెస్ట్‌ చేయాలన్న ఎరిక్‌సన్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ వినీత్‌ సహరన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. 

స్వీడన్‌కు చెందిన టెలికం ఉపకరణాల సంస్థ ఎరిక్‌సన్‌ కు రూ.453 కోట్లు నగదు చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో జాప్యం చేస్తునందన ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Trending News