UPA: యూపీఏ ఛైర్ పర్సన్ పదవిపై శరద్ పవార్..ఏమన్నారు

UPA: ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్ గురించి ఇటీవలి కాలంలో ఓ వార్త వైరల్ అవుతోంది. యూపీఏ ఛైర్‌పర్సన్ పదవి శరద్ పవార్‌కు దక్కబోతుందనేదే ఆ వార్త. మరి దీనిపై శరద్ పవార్ ఇప్పుడు ఏమని స్పందించారో తెలుసా..

Last Updated : Dec 27, 2020, 06:50 PM IST
UPA: యూపీఏ ఛైర్ పర్సన్ పదవిపై శరద్ పవార్..ఏమన్నారు

UPA: ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్ గురించి ఇటీవలి కాలంలో ఓ వార్త వైరల్ అవుతోంది. యూపీఏ ఛైర్‌పర్సన్ పదవి శరద్ పవార్‌కు దక్కబోతుందనేదే ఆ వార్త. మరి దీనిపై శరద్ పవార్ ఇప్పుడు ఏమని స్పందించారో తెలుసా..

యూపీఏ ( UPA ) తదుపరి ఛైర్‌పర్సన్ ( Chairperson ) ఎవరు..ఇప్పుడిదే ఆసక్తిగా మారింది. నిన్న మొన్నటి వరకూ ఈ పదవి ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు దక్కనుందని వార్తలు వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ ( Congress ) సహా అన్నిపార్టీలతో సత్సంబంధాలు కలిగిన శరద్ పవార్ అన్ని విధాలా యూపీఏ ఛైర్ పర్సన్ పదవికి అర్హులనే వార్తలు వచ్చాయి. పవార్ ఆ పదవిని స్వీకరిస్తానంటే తమకే అభ్యంతరం లేదని..పవార్ ఆ పదవికి అన్ని విధాలా అర్హులని మిత్రపక్షం శివసేన ( Shiv sena ) కూడా స్పష్టం చేసింది. కానీ ఎన్సీపీ ( NCP ) మాత్రం ఈ తరహా వార్తల్ని గతంలో ఓసారి ఖండించింది. అటువంటి విషయమేదీ యూపీఏ పార్టీల మధ్య చర్చకు రాలేదని స్పష్టం చేసింది.

ఇప్పుడు స్వయంగా శరద్ పవార్ ( Sharad pawar ) ఈ విషయంపై స్పందించారు. యూపీఏ ఛైర్‌పర్సన్ పదవి స్వీకరించనున్నట్టు వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. తనకంత సమయం గానీ..ఆసక్తి గానీ లేవని ..అసలు అలాంటి ప్రతిపాదనకు అవకాశమే లేదని శరద్ పవార్ స్పష్టంగా చెప్పారు. 

Also read: MBBS @ 64: కుమార్తె జ్ఞాపకార్ధం..64 ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్

Trending News