Southwest Monsoon: దేశంలో నైరుతి రుతు పవనాలు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇవాళ దేశ రాజధానిని రుతుపవనాలు తాకాయి. దీంతో ఢిల్లీలో తొలకరి జల్లు కురిసింది. ఈ విషయాన్ని భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో యూపీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాజస్థాన్, పంజాబ్, హర్యానాలోనూ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ఉత్తరాధి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వర్షం కారణంగా వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్‌తో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు..ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి.
రుతు పవనాలు, ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజులపాటు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ తీరం వరకు ఉన్న తూర్పు పడమ ద్రోణి..ఇవాళ తెలంగాణ రాష్ట్ర నుంచి దూరంగా వెళ్లింది. మరోవైపు కింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి.
రాగల మూడురోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి మరికొన్ని ప్రాంతాల్లో వానలు పడనున్నాయి. తెలంగాణలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Also read: Sanjay Raut: అంతా కలిసి ఉద్దవ్ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచారు..సంజయ్ రౌత్ హాట్ కామెంట్స్..!
Also read: PM Modi Tour in AP: జులై 4న అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు..పాల్గొననున్న ప్రధాని..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Southwest Monsoon: దేశ రాజధానిని తాకిన నైరుతి రాగం..ఉత్తరాధిలోనూ ఇక భారీ వర్షాలే..!
దేశంలో బలపడుతున్న నైరుతి రుతు పవనాలు
రాజధానిని తాకిన నైరుతి రాగం
మూడురోజులపాటు వర్ష సూచన