బీజేపీ ఎంపీ కిరిత్ సోమియాపై ఓ కూరగాయల వ్యాపారి కేసు పెట్టాడు. తనపై ఆ ఎంపీ చేయి చేసుకున్నట్లు, పైగా తన వద్ద డబ్బులు కూడా తీసుకున్నట్లు ఆ వ్యాపారి ఆరోపిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ముంబాయిలో కూరగాయలు అమ్ముకుంటున్న వ్యాపారి వద్దకు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో బీజేపీ ఎంపీ కిరిత్ సోమియా వెళ్లాడు. ఈ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేయాలని వ్యాపారిని హెచ్చరించి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ వచ్చిన ఆ నేత కూరగాయల వ్యాపారి మీద ఆగ్రహం వ్యక్తం చేసి.. ఇంకా ఎందుకు ఖాళీ చేయలేదని వారించాడు. ఖాళీ చేస్తున్నామని చెబుతున్నా.. అదేమీ వినిపించుకోకుండా కిరిత్ తనపై చేయి చేసుకున్నట్లు ఆ కూరగాయల వ్యాపారి ఆరోపించాడు. అక్కడితో ఆకుండా కూరగాయలు కొంటున్న మహిళా బ్యాగును తోసేశారని, తన వద్ద రూ. 1250 జరిమానా కట్టించుకున్నట్లు వ్యాపారి అన్నాడు. ఎంపీ అమర్యాదగా ప్రవర్తించాడని కూరగాయల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Street vendor filed complaint against BJP MP Kirit Somaiya in Mumbai, said, 'he(Kirit Somaiya) came at 8 pm & asked us to vacate the place. He came again, we told him we are vacating but he pushed us.A lady was buying vegetables, he threw her bag,also made us pay fine of Rs 1250' pic.twitter.com/E4pw7T4Obo
— ANI (@ANI) May 21, 2018