Supreme Court: ఎస్సీ, ఎస్టీ పదోన్నతుల్లో రిజర్వేషన్ల విషయమై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయమై గతంలో ఇచ్చిన తీర్పును తిరిగి సమీక్షించేది లేదని స్పష్టం చేసింది.
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు(Supreme Court) మరోసారి తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని గతంలో ఇచ్చిన ఆదేశాల్ని తిరిగి సమీక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఇక ఆదేశాల్ని ఎలా అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని సూచించింది. అంతేకాకుండా పదోన్నతుల్లో రిజర్వేషన్ల కల్పనపై ఎదురవుతున్న ఇబ్బందుల్ని నోట్ రూపంలో రెండు వారాల్లో అందించాలని ఆదేసించింది. జర్నైల్‌సింగ్ వర్సెస్ లచ్మి నరైన గుప్తా కేసులో ఇంప్లీడ్ అయిన 133 పిటీషన్లను జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ గవాయిల ధర్మాసనం విచారించింది.కేసుల్ని తిరిగి ప్రారంభించాలని భావించడం లేదని చెప్పింది.
ఏ గ్రూపులు వెనుకబడి ఉన్నాయి..ఏవి లేవనే విషయాన్ని రాష్ట్రాలు ఎలా నిర్ణయిస్తాయని ప్రశ్నించిన న్యాయవాది ఇందిరా జైసింగ్‌కు కోర్టు సమాధానమిచ్చింది. విధానాలు ఎలా అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వాలకు తాము చెప్పమని..న్యాయ సమీక్షకు లోబడి ఎలా అమలు చేయాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని తెలిపింది. ఈ విషయంపై మూడు హైకోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయని..రెండు పదోన్నతుల్ని కొనసాగించాలని చెప్పగా..మరొకటి స్టే ఇచ్చిందని అటార్నీ జనరల్ కోర్టుకు విన్నవించారు. స్టేటస్ కో ఆదేశాల కారణంగా 2 వేల 5 వందల వరకూ సాధారణ పదోన్నతులు ఏళ్ల తరబడి నిలిచిపోయాయన్నారు. అందుకే అడ్‌హాక్ రూపంలో వాటిని చేపట్టాలనేది కేంద్ర ప్రభుత్వం(Central government) ఆలోచనగా వేణుగోపాల్ తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల నిబంధనల్లో( SC ST Reservation Promotions)ఉన్న గందరగోళాన్ని పరిష్కరించాలని కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాయి.
Also read: Bank of India Offer: అద్బుత ప్రయోజనాలతో బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ అక్కౌంట్ వివరాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook