Supreme Court Key Points: రాజద్రోహం అలియాస్ సెడిషన్ యాక్ట్ అలియాస్ ఐపీసీ సెక్షన్ 124 ఏ. బ్రిటీషు కాలం నాటి ఈ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ నేపధ్యంలో రాజద్రోహం కేసుకు సంబంధించి ఐదు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం...
రాజద్రోహం కేసు అంటే ఐపీసీ సెక్షన్ 124. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేసు. సుప్రీంకోర్టు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఆ కేసులన్నీ నిలిపివేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దేశంలో ఇప్పటివరకూ ఉన్న అన్ని రాజద్రోహం కేసులపై స్టే విధించింది. రాజద్రోహం కేసుల్ని నిలిపివేస్తున్నట్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఇప్పటివరకూ ఈ కేసులో అరెస్టైన వాళ్లంతా బెయిల్ పెట్టుకోవచ్చని తెలిపింది.
చారిత్రాత్మక తీర్పులో ఐదు కీలక విషయాలు
1. చారిత్రాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పులో రాజద్రోహానికి సంబంధించి అన్ని పెండింగు కేసులపై స్టే జారీ అయింది. తదుపరి విచారణ ముగిసేవరకూ దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్ర పోలీసులు కూడా ఈ కేసు పెట్టకూడదు. ప్రస్తుత తరుణంలో రాజద్రోహం కేసులు అవసరం లేదని..బ్రిటీష్ పాలన సమయంలో అప్పటి పరిస్థితుల దృష్ట్యా అమలు చేసిన చట్టమని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దగీనిపై పున పరిశీలన చేయాలని ఆదేశించారు.
2. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ఆదేశాలు జారీ చేసే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి ఉందని సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ తెలిపారు. పూర్తి విచారణ ముగిసేవరకూ ఈ చట్టాన్ని ఉపయోగించకూడదని..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా చట్టంలో ఏ విధమైన మార్పులు చేయాలో నిర్ణయించుకుంటే మంచిదని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ రమణ చెప్పారు.
3. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తిరిగి సమీక్షించాలి. ఈ చట్టం దుర్వినియోగమవుతోందనేది పిటీషనర్ల వాదన. హనుమాన్ చాలీసా కేసులో రాజద్రోహం కేసు నమోదు చేయడాన్ని అటార్నీ జనరల్ కూడా ప్రస్తావించారని ఛీప్ జస్టిస్ ఎన్ వి రమణ చెప్పారు. ఈ చట్టం కింద ఎక్కడైనా తాజాగా కేసులు నమోదైతే..బాధితులు కోర్టును ఆశ్రయించాలి.
4. ఐపీసీ సెక్షన్ 124 ఏ ప్రకారం భవిష్యత్తులో ఈ చట్టం కింద కేసు నమోదు చేయాలంటే..ఎస్పీ స్థాయి లేదా అంతకంటే ఎక్కువున్న అధికారి సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పెండింగు కేసులపై కోర్టులు బెయిల్ మంజూరు చేయవచ్చు.దేశవ్యాప్తంగా 8 వందల రాజద్రోహం కేసులుండగా..13 వేలమంది జైళ్లలో ఉన్నారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు.
5. దేశంలో అమలవుతున్న బ్రిటీషు కాలం నాటి రాజద్రోహం కేసులో కేంద్రం సమీక్షకు అంగీకరించినందున ఈ కేసులో దాఖలైన పిటీషన్లను కొట్టివేయాలనే వాదన వచ్చింది.
Also read: Sedition Law on Hold: రాజద్రోహం చట్టంపై స్టే.. సుప్రీం చారిత్రక తీర్పు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook