Krishan Pal Gurjar: మరో కేంద్ర మంత్రికి కరోనా

Social Justice and Empowerment Minister tested Covid-19: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్(coronavirus ) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇటీవల అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలకు కరోనా సోకింది.

Last Updated : Aug 27, 2020, 03:14 PM IST
Krishan Pal Gurjar: మరో కేంద్ర మంత్రికి కరోనా

Social Justice and Empowerment Minister tested Covid-19: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ ( coronavirus ) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇటీవల అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలకు కరోనా సోకింది. తాజాగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్‌ ( Krishan Pal Gurjar ) కూడా కరోనా బారిన పడ్డారు. Also read: Health Benefits Of Honey: పాలలో తేనె కలిపి తాగితే.. ఎన్నో ప్రయోజనాలు

ఇటీవల తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తగా.. కరోనా పరీక్ష చేయించుకున్నానని.. రిపోర్టు పాజిటివ్‌గా వచ్చిందని క్రిషన్ పాల్ గుర్జార్‌ తెలిపారు. వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతానని ఆయన ట్విట్టర్ ద్వారా గురువారం వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని క్రిషన్ పాల్ గుర్జార్ కోరారు. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసుల సంఖ్య 33 లక్షలు దాటింది. దీంతోపాటు.. ఇప్పటివరకు 60 వేలకుపైగా కరోనా బాధితులు మరణించారు.   Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

Trending News