ఆధార్ సహా పలు కీలక అంశాలపై నేడు సుప్రీంకోర్టులో తీర్పు

నాలుగు కీలక అంశాలపై సుప్రీంకోర్టు తీర్పు నేడే..

Last Updated : Sep 26, 2018, 10:49 AM IST
ఆధార్ సహా పలు కీలక అంశాలపై నేడు సుప్రీంకోర్టులో తీర్పు

పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్.. రేషన్, ఇతర ప్రభుత్వ పథకాలు.. ఇలా అన్నింటికీ ఆధార్ సంఖ్యను కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతున్నదని ఆందోళనలు చెలరేగాయి. ఆధార్‌ చట్టబద్ధతను, ప్రభుత్వ పథకాలకు దానిని తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గత జనవరిలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... 38రోజులపాటు విచారించింది. బుధవారం ఐదుగురు ‘అత్యున్నత’ సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం దీనిపై తీర్పును వెలువరించనుంది.

బుధవారం సుప్రీంకోర్టు ఆధార్‌తో పాటు మరో మూడు కీలక అంశాలపై తీర్పులు వెలువరించే అవకాశం ఉంది. అందులో..

  • దేశవ్యాప్తంగా కోర్టులో విచారణల సమయంలో ప్రత్యక్ష ప్రసారం కోరుతూ దాఖలైన పిటిషన్లపై తీర్పు రావచ్చని భావిస్తున్నారు.
  • ప్రమోషన్లలో ఎస్సీ/ ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్‌ కోటాపై ప్రయోజనాలు పొందేందుకు కొన్ని షరతులు విధిస్తూ వచ్చిన తీర్పుపై పునఃపరిశీలించాలని దాఖలైన పిటిషన్లపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన  రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.
  • అనర్హత వేటుపడిన చట్టసభ సభ్యుల శిక్షపై అప్పీలేట్‌ న్యాయస్థానం స్టే మంజూరు చేస్తే చట్టసభలో వారి సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారా? అనే ప్రశ్నపై స్పష్టత రానుంది.

Trending News