Jallikattu: తమిళనాడు ప్రభుత్వానికి ఊరట.. జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme Court Upholds Allowing Jallikattu: తమిళనాడులో జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థిస్తూ.. జల్లికట్టు తమిళనాడు సంస్కృతిలో భాగమని పేర్కొంది. అయితే జంతువుల పట్ల హింసకు పాల్పడితే చర్యలు తీసుకువాలని తెలిపింది.  

Written by - Ashok Krindinti | Last Updated : May 18, 2023, 02:09 PM IST
Jallikattu: తమిళనాడు ప్రభుత్వానికి ఊరట.. జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme Court Upholds Allowing Jallikattu: సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి ఊరట లభించింది. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నిర్వహించే జల్లికట్టు క్రీడను సుప్రీంకోర్టు సమర్థించింది. జల్లికట్టుపై నిషేధించడానికి నిరాకరించింది. జల్లికట్టును అనుమతిస్తూ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. జల్లికట్టులో పాల్గొనే ఎద్దులపై క్రూరత్వానికి పాల్పడుతున్నారని.. ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. తమిళనాడు చట్టం పార్లమెంట్ ఆమోదించిన జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. జల్లికట్టుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం అందించిన పత్రాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపింది. కొత్త చట్టంలో క్రూరత్వానికి సంబంధించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఆట శతాబ్దాలుగా తమిళనాడు సంస్కృతిలో భాగం అని.. ప్రభుత్వం చేసిన చట్టానికి లోబడి తీర్పు ఉంటుందని పేర్కొంది. అయితే ఎవరైనా జంతువులపై హింసకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. జల్లికట్టుపై నిషేధం లేదని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం కీలక తీర్పునిచ్చింది.

'జల్లికట్టు తమిళనాడు సంస్కృతి సంప్రదాయాలలో భాగం. జల్లికట్టు సంస్కృతి వేల సంవత్సరాలుగా ఆచరిరిస్తున్నారని మేము అర్థం చేసుకున్నాం. జల్లికట్టుకు ఆమోదం తెలిపేందుకు తమిళనాడు ప్రభుత్వం అందించిన అన్ని పత్రాలు, సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయి. జల్లికట్టుపై నిషేధం విధించడం కుదరదు.. జంతువులను క్రూరత్వం నుంచి రక్షించడానికి రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకున్నాయి. సంస్కృతిని పరిరక్షించడం, సాంప్రదాయ జాతుల జంతువులను ప్రోత్సహించడం కూడా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత..' అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

జల్లికట్టును కొన్ని నిర్దిష్ట సమూహాలు మాత్రమే ఆచరిస్తాయని.. దీనికి తమిళుల సంస్కృతితో సంబంధం లేదని పెటాతో పాటు పలు సంస్థలు వాదిస్తున్నాయి. జల్లికట్టును అంగీకరించరాదని కోరుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం చేసిన సవరణ ప్రాథమిక హక్కులను కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబాల, మహారాష్ట్రలో చక్కడి వంటి సంప్రదాయ క్రీడలను నిర్వహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చట్టాలను రద్దు చేయడంతోపాటు ఇలాంటి ఆటలను నిషేధించాలంటూ పెటాతోపాటు ఇతర సంస్థలు కోరుతున్నాయి. 

Also Read: Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?  

Also Read: Cabinet Meeting: కొత్త సచివాలయంలో తొలిసారి కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News