Delhi Metro: 7నుంచి మెట్రో సేవలు.. స్మార్ట్‌కార్డ్‌తోనే అనుమతి

కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఢిల్లీలో మెట్రో సేవలను పున:ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) ఏర్పాట్లు చేస్తోంది. 

Last Updated : Aug 30, 2020, 05:40 PM IST
Delhi Metro: 7నుంచి మెట్రో సేవలు.. స్మార్ట్‌కార్డ్‌తోనే అనుమతి

Delhi Metro start from September 7: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 4.0లో భాగంగా మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఢిల్లీలో మెట్రో సేవలను పున:ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణాల కోసం ఇకనుంచి టోకెన్లను జారీ చేయమని, కేవలం స్మార్ట్‌ కార్డులతోపాటు ఇతర డిజిటల్‌ పేమెంట్ పద్ధతులను అనుమతించనున్నట్లు ఢిల్లీ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాశ్‌ గెహ్లోత్‌ (Kailash Gahlot ) ఆదివారం మాట్లాడుతూ.. సెప్టెంబరు 7 నుంచి మెట్రో ( Delhi Metro ) సేవలు ప్రారభమవుతాయని.. కరోనా (Coronavirus) వ్యాప్తి నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్టేషన్‌లోకి వచ్చే సమయంలో ప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. Also read: Narendra Modi Birthday: ‘సేవా సప్తాహ్’‌గా మోదీ జన్మదిన వేడుకలు

దీంతోపాటు కరోనా భద్రతా నియమాలు పాటించేలా ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ఫ్లాట్‌ఫాంలు, ఫ్లోర్‌పై పోస్టర్లు, స్టికర్లు ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. 7 నుంచి మెట్రో సర్వీసులు నడవనున్న నేపథ్యంలో తక్కువ మంది ప్రయాణికులను అనుమతిస్తామంటూ.. ప్రభుత్వం మెట్రో మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే.. కరోనా కారణంగా మార్చి నెలలో ఢిల్లీ మెట్రో సర్వీసుల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రభుత్వానికి దాదాపు రూ.1300 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.  Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x