Thief boarded 200 days in 110 flights cop accused arrested in delhi:మనం తరచుగా బస్సులలో, మెట్రో ట్రైన్ లలో చోరీల సంఘటనలను చూస్తుంటాం. మెయిన్ గా చోరీలకు పాల్పడే వారు రద్దీగా ఉండే బస్సులను, ట్రైన్ లను టార్గెట్ గా చేసుకుంటూ ఉంటారు. మెల్లగా బస్సులలో ఎక్కి వెనకాలే నక్కి ఉండి, జేబులో నుంచి లేదా మెడలో నుంచి బంగారం, డబ్బులను చోరీచేస్తుంటారు. కొందరు రోడ్ల మీద కూడా బైక్ ల మీద వెళ్తు చోరీలు చేస్తుంటారు. అడ్రస్ అడిగినట్లు నటించి, మెడలోని మంగళసూత్రంలతో పారిపోతుంటారు. టూవీలర్ మీద వెళ్లేటప్పుడు వెనుక నుంచి వచ్చి, ఒక్కసారిగా దాడులు చేసి చోరీలకు పాల్పడుతుంటారు. ఇవన్ని మనం తరచుగా చూస్తుంటాం.
Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?
ఇక పండుగల సీజన్ లలో ట్రైన్ లలో ఫుల్ రష్ ఉంటుంది. అలాంటి సమయంలో, ప్రయాణికులలో దొంగలు కూడా ఉంటారు. రాత్రిళ్లు పడుకున్నాక.. చోరీలకు పాల్పడే వారు కూడా ఉంటారు. అంతేకాకుండా..మనం ఏటైన గ్రామాలకు, ఊర్లకు ఇంటికి తాళం వేసి వెళ్లగానే.. కొందరు రెక్కి వేస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో కూడా చోరీలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక హైటేక్ దొంగ ప్రయాణికులకు చుక్కలు చూపించాడు. అతను కేవలం ఫ్లైట్ లలో ప్రయాణిస్తూ, కాస్లీ వస్తువులను కాజేస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి కేటుగాడిని అరెస్ట్ చేశారు.
పూర్తివివరాలు..
గత నెలలో ఒక మహిళ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లింది. ఆమె తన హ్యాండ్‌బ్యాగ్‌లోని ₹ 7 లక్షల విలువైన ఆభరణాలు పెట్టుకుని విమానం క్యాబిన్ లో పెట్టింది. విమానంల్యాండ్ అయ్యాక చూసుకుంటే మాత్రం అదిలేదు. దీంతో వెంటనే ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై సీరియస్ గా విచారణ ప్రారంభించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలపై పోలీసులకు అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి.ఢిల్లీ, హైదరాబాద్, అమృత్సర్ విమానాశ్రయాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్కాన్ చేశారు. ఈ క్రమంలో.. ఢిల్లీలోని పహర్గంజ్లో రాజేష్ కపూర్‌ను అరెస్టు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని తనదైన స్టైల్ లో విచారించగా.. ఏడాదిగా చోరీల ఘటనలను ఒప్పుకున్నాడు. ఇతను చెప్పిన విషయాలు విని పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. గత ఏడాది కాలంలో.. 200 ల విమానాలలో చోరీలకు పాల్పడ్డాడు. 2023లో అనేక మంది ప్రయాణికుల నుండి విలువైన వస్తువులను దొంగిలించాడు. గతంలో.. యూఎస్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి తన క్యాబిన్ బ్యాగ్ నుండి ₹ 20 లక్షల విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయని నివేదించిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ముఖ్యంగా ఇతగాడు.. కనెక్టింగ్ ఫ్లైట్లలో ప్రయాణించే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకున్నాడని ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఉషా రంగరాణి తెలిపారు. ఉదాహరణకు, ఏప్రిల్‌లో హైదరాబాద్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న మహిళ ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయం నుండి యుఎస్‌కి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా విమానం ఎక్కవలసి వచ్చింది. అదేవిధంగా, US నివాసి, వర్జిందర్‌జిత్ సింగ్, అమృత్సర్ నుండి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు ప్రయాణిస్తున్నాడు. ఢిల్లీ నుండి కనెక్టింగ్ ఫ్లైట్‌ను కలిగి ఉన్నాడు. వీరిమీద నిఘా పెట్టి చోరీలకు పాల్పడేవాడు. వృద్ధులు, మహిళా ప్రయాణీకులను అతను తన లక్ష్యంగా ఎంచుకున్నాడని తెలుస్తోంది. విమానాశ్రయంలో వారి ప్రవర్తనను గమనించేవాడని సీనియర్ పోలీసు తెలిపారు. బ్యాగ్‌లోని విలువైన వస్తువుల గురించి మరిన్ని వివరాలను పొందడానికి అతను వారిని సీక్రెట్ గా ఫాలో అయ్యేవాడు. అంతేకాకుండా.. బ్యాగేజీ డిక్లరేషన్ స్లిప్‌లోని సమాచారాన్ని తెలివిగా చదివాడు. ఆ వ్యక్తి బోర్డింగ్ గేట్ వద్ద ఎక్కువగా సంభాషించడాన్ని తాము చూశామని కొందరు పోలీసులు గుర్తించారు.
నిందితుడు ప్రయాణికుల పక్కనే ఉండేలా సీటు మార్చాల్సిందిగా విమానయాన సంస్థను కోరేవాడని పోలీసులు తెలిపారు. అతను దొంగిలించే ప్రయాణీకుడి దగ్గర తరచుగా కూర్చుని ఓవర్ హెడ్ విభాగంలో బ్యాగులను సర్దుబాటు చేస్తున్నట్లు నటించి, ఇతర ప్రయాణికులు విమానంలో ఎక్కేటప్పుడు నగలు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించేవాడని పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఢిల్లీ పహర్గంజ్లో రాజేష్‌కు.. 'రికీ డీలక్స్' అనే అతిథి గృహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇతగాడు.. గెస్ట్ హౌస్ యొక్క మూడవ అంతస్తులో నివసించేవాడు. ఢిల్లీలో ఇతను డబ్బులను మార్పిడి చేసే బిజినెస్, ఢిల్లీలో మొబైల్ రిపేర్ షాప్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, చండీగఢ్, బెంగళూరు, ముంబై, అమృత్సర్ వంటి విమానాశ్రయాల్లోని అనేక మంది మహిళా ప్రయాణికుల బ్యాగుల్లోని విలువైన వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. పహర్‌గంజ్‌లోని అతని ఇంటి నుండి పెద్ద మొత్తంలో బంగారం , వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అతను అనేక సందర్భాల్లో దొంగిలించిన ఆభరణాలను పొరుగున ఉన్న కరోల్ బాగ్‌లోని శరద్ జైన్ అనే నగల వ్యాపారికి విక్రయించినట్లు కూడా అతను వెల్లడించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter