భూమ్మీద నూకలుంటే ఎలాగైనా బతికి బట్టకట్టేయొచ్చని పెద్దలు చెబుతుంటారు కదా.. అది ఇదేనేమో అనిపించకమానదు ఈ వీడియో చూస్తే. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో చూస్తే, రైలు నడిపే లోకోపైలట్లకు ఇంత నిర్లక్ష్యమా అని కూడా అనిపించకమానదు. అది హౌరా నుంచి ధిగాకు మధ్య రాకపోకలు సాగిస్తున్న రైలు. ధిగాకు బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న ఆ రైలు కింది భాగంలో ఓ పైపు తెగిపోవడంతో గార్డు రైలు కింద ఆ పైపుని జోడించే పనిలో నిమగ్నమయ్యాడు. రైలు కోచ్‌కి ఇరువైపులా సిబ్బంది అతడికి సహాయంగా నిలబడ్డారు. అయినప్పటికీ.. గార్డులను గమనించుకోని రైలు లోకో పైలట్ రైలును అలాగే ముందుకు కదిలించాడు.
అనుకోని హఠాత్పరిణామానికి షాకైన సిబ్బంది వెంటనే గట్టిగా అరుస్తూ లోకోపైలట్‌ని అప్రమత్తంచేశారు. దీంతో వారి కేకలు విన్న లోకో పైలట్ రైలు వేగం పుంజుకోకముందే రైలుని నిలిపేశాడు. ఈలోగా రైలు కోచ్ కింద ఉన్న ఓ పైపును పట్టుకుని తన ప్రాణాలు రక్షించుకున్నాడు రైలు కిందున్న గార్డు. లేదంటే చాలా దారుణమే జరిగిపోయేది.
వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. -> http://zeenews.india.com/bengali/videos/shocking-howrah-digha-ac-superfast-express-runs-with-guard-under-train_227793.html