Vasant Panchami: వసంత పంచమి రోజు ఘోర అపచారం.. చీర లేకుండా నగ్నంగా సరస్వతి దేవీ విగ్రహం.. భారీగా ఆందోళనలు..

Tripura: వసంత పంచమిని అందరు ఎంతో పవిత్రంగా భావిస్తారు. నిన్న జరిగిన ఈ వేడుకలను దేశమంతాట జరుపుకున్నారు. సరస్వతి దేవీ ఆలయాలంతో పాటు, అనేక ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు, శ్రీకారాలు రాయించారు. వేలాదిగా జంటలు ఈరోజున పెళ్లి  బంధంతో ఒక్కటయ్యాయి. ఇలాంటి పవిత్రమైన రోజున త్రిపురలో అపచారాం జరిగింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 15, 2024, 10:48 AM IST
  • - చీర లేకుండానే అసభ్యంగా సరస్వతి విగ్రహం తయారీ..
    - సీఎం కల్గజేసుకొవాలంటున్న స్థానిక నేతలు..
Vasant Panchami: వసంత పంచమి రోజు  ఘోర అపచారం.. చీర లేకుండా నగ్నంగా సరస్వతి దేవీ విగ్రహం.. భారీగా ఆందోళనలు..

Saraswati Idol Without Saree: శ్రీ పంచమి, వసంత పంచమిని హిందువులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు.  ఈరోజున చదువుకు, జ్ఞానానికి అధిదేవత అయిన శారాదా దేవీ జన్మదినం. సరస్వతి దేవీ అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నిరకాల విద్యలలో కూడా ముందుంటారు. జీవితంలో కొన్నిసార్లు ధనం ఉంటుంది .. మరల వెళ్లిపోతుంది. అందుకే లక్ష్మీదేవిని చంచల అనికూడా అంటారు. కానీ మనం నేర్చుకున్న విద్య, కష్టపడి సంపాదించిన జ్ఞానం మాత్రం ఎక్కడికి పోదు. అందుకే చాలా మంది శారదా దేవీ అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు. 

Read More: Millet Roti For Weight Loss: మిల్లెట్స్‌ రోటీతో బరువుతో పాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడం ఎలా?

అలాంటి పవిత్రమైన రోజున షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వసంత పంచమి రోజున సరస్వతి దేవీ విగ్రహలను ప్రతిష్టిస్తుంటారు. స్కూల్ లలో, కాలేజీలలో, గ్రామాలలో ప్రత్యేకంగా చేతిల్లో వీణ, పుస్తకాలు, కమలం పువ్వు, జపమాల ఉన్న విగ్రహాలను  మనం తరచుగా చూస్తుంటాం. అయితే.. త్రిపురలోని ప్రభుత్వ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కళాశాలలో సరస్వతీ దేవి విగ్రహాన్ని చాలా తప్పుగా మలచారని వార్త వెలుగులోకి వచ్చింది.

అమ్మవారి విగ్రహం తయారు చేసేటప్పుడు సంప్రదాయ చీరలేకుండా తయారుచేశారు. దీంతో ఆ విగ్రహం చూడటానికి  అసభ్యంగా ఉంది. దీంతో అది కాస్త రచ్చగా మారింది. కాలేజీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యుల నేతృత్వంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ కావడంతో అక్కడికి బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది.

త్రిపురలోని అగర్తలాలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ను నిరసనకారులు విగ్రహాన్ని చీరతో కప్పాలని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో కొందరు అమ్మవారి విగ్రహానికి చీరతో కప్పిఉంచారు.  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS). దీనిపై సీరియస్ అయ్యింది. కాలేజీ  అనుబంధ విద్యార్థి సంఘం ABVP, కళాశాల అథారిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా దీనిలో  జోక్యం చేసుకోవాలని కోరారు.

Read More: Sreeleela: సీతాకోకచిలుకలా శ్రీలీల.. ఈ ఫోటోలు చూస్తే ప్రేమలో పడాల్సిందే

ఈ విగ్రహం హిందూ దేవాలయాల్లోని సంప్రదాయ శిల్ప రూపాలకు కట్టుబడి ఉందని, మతపరమైన మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని కళాశాల అధికారులు వివరించారు. చివరికి విగ్రహాన్ని కళాశాల అధికారులు మార్చారు.  ప్లాస్టిక్ షీట్‌లతో కప్పి, పూజ పండల్ వెనుక ఉంచారు. అయితే.. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కళాశాల లేదా ABVP,  బజరంగ్ దళ్ లు దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.
 

Trending News