కేరళలో జరిగిన వెంగార అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ కేవలం నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికలలో యూడీఎఫ్ అభ్యర్థి కేఎన్ఏ ఖాదర్ 65వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కేవలం 5728 ఓట్లు మాత్రమే ఈసారికి బీజేపీకి పోలయ్యాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీకి 1327 ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. ఇదే ఎన్నికల్లో ఎల్డీఎఫ్ రెండవ స్థానంతోనూ, ఎస్డీపీఐ మూడవ స్థానంతోనూ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెంగార సిట్టింగ్ ఎమ్మెల్యే, ఐయూఎంఎల్ నేత పీకే కున్హాలికుట్టీ ఈ ఏడాది ఏప్రిల్లో మలప్పురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికవ్వడంతో, అక్కడ ఉప ఎన్నికను నిర్వహించాల్సి వచ్చింది.