దేశంలో మరో రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్ నగరాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 50-50 పెట్టుబడి పద్ధతిలో మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం కేబినెట్ ఆమోదించింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రెండు ప్రాజెక్టులు 4 ఏళ్లలో పూర్తికానున్నాయి. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం భోపాల్లో ఏర్పాటు కానున్న ప్రాజెక్టు 27.87 కి.మీ పరిధిలో విస్తరించి ఉండనుండగా ఈ ప్రాజెక్టు కోసం రూ.6,941.40 కోట్లు వెచ్చించనున్నారు.
ఇక ఇండోర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయానికొస్తే, 31.55 కిమీ రైలు మార్గంతో నగరం నలుమూలలకు సేవలు అందించనున్న ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500.80 కోట్లు వెచ్చించనున్నారు.