Bharath Rice: ప్రజలకు శుభవార్త 'భారత్‌ రైస్‌' పేరుతో రూ.29కే నాణ్యమైన బియ్యం మీ సొంతం

Subsidy Rice: రోజురోజుకు పెరుగుతున్న ధరలతో దేశ ద్రవ్యోల్బణం ప్రమాదకరంగా మారింది. నిత్యావసర సరుకులు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపట్టింది. భారత్‌ రైస్‌ పేరిట రూ.29కే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 2, 2024, 10:38 PM IST
Bharath Rice: ప్రజలకు శుభవార్త 'భారత్‌ రైస్‌' పేరుతో రూ.29కే నాణ్యమైన బియ్యం మీ సొంతం

Bharath Brand in Rice: ప్రస్తుతం దేశంలో తృణధాన్యాల ధరలు 10 శాతం మేర పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు బయట కొనలేని పరిస్థితి. ఇక వీటిలో బియ్యం ధరలు మాత్రం మండుతున్నాయి. రూ.40 నుంచి రూ.50 చెల్లించనది నాణ్యమైన బియ్యం లభించడం లేదు. ఇదంతా మార్కెటర్ల మాయాజాలం అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రజలకు అతి తక్కువ ధరకు బియ్యం అందించేలా సరికొత్త కార్యక్రమం ప్రారంభించింది. 

భారత్‌ రైస్‌ పేరిట బియ్యం రూ.29కే అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. 'వివిధ రకాల బియ్యం ఎగుమతి పరిమితులు విధించినా బియ్యం ధరలు 13.8 శాతం నుంచి 15.7 శాతం పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను గుర్తించేలా వచ్చే వారం నుంచి రిటైల్‌ మార్కెట్‌లో రాయితీతో కూడిన భారత్‌ రైస్‌ను కిలో రూ.29 చొప్పున విక్రయించనున్నాం' అని కేంద్ర ప్రభుత్వ అధికారి సంజీవ్‌ చోప్రా తెలిపారు.

దేశంలో మనకు కావలసిన నిల్వల కంటే కూడా అధిక మోతాదులో బియ్యం నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కానీ మార్కెట్ పరిస్థితులకు లోబడి బియ్యం ధరలు పెరిగిన కారణంగా సామాన్య పేద మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర ప్రభుత్వ అవుట్ లెట్లలో భారత్ రైస్ పేరుతో 29 రూపాయలకే బియ్యం అందించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 'భారత్ దాల్', 'భారత్ వీట్' పేర్లతో పప్పు, గోధుమ పిండి అందిస్తున్న విషయం తెలిసిందే. సామాన్య, పేద మధ్యతరగతి ప్రజలకు గోధుమ పిండి రూ.27.50, పప్పును రూ.60కి కిలో చొప్పున అందిస్తోంది.

ఎక్కడ తీసుకోవాలి?
భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (నాఫెడ్‌), భారత సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీపీఎఫ్‌), కేంద్రీయ భండార్‌కు సంబంధించిన కేంద్రాలలో భారత్‌ బియ్యం అందుబాటులో ఉంటాయి. భారత్‌ రైస్‌ 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్ల చొప్పున అందుబాటులో ఉంచనుంది. భారత్‌ రైస్‌ కోసం కేంద్ర ప్రభుత్వం తొలి దశలో 5 లక్షల టన్ను బియ్యాన్ని కేటాయించింది.

Also Read: Gaddar Awards: 'గద్దర్‌ అవార్డు'లపై సినీ పరిశ్రమ మౌనం.. తొలిసారి మోహన్‌ బాబు ఏమన్నారంటే..?

Also Read: KTR Letter To Revanth: ఆటో డ్రైవర్లు చస్తుంటే కనికరం లేదా సీఎం రేవంత్‌ రెడ్డి? మాజీ మంత్రి కేటీఆర్‌ లేఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News