Chardham Devasthanam board : చార్‌ ధామ్ దేవ‌స్థానం బోర్డు ర‌ద్దు

Char Dham Devasthanam Board Bill repeal : అన్ని అంశాల‌ను అధ్య‌య‌నం చేశాక.. చార్‌ ధామ్ దేవ‌స్థానం బోర్డు చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకున్నట్లు ఆయ‌న తెలిపారు. కాగా చార్‌ ధామ్ దేవ‌స్థానం బోర్డ్‌ 2019 లో ఏర్పాటైంది. ఈ బోర్డును ర‌ద్దు చేయాల‌ంటూ చాలా కాలంగా స్థానిక పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఆల‌యాల సంప్ర‌దాయ హ‌క్కులను ఈ బోర్డ్‌ అడ్డుకుంటోందని వారి ఆరోపణ.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 08:19 PM IST
  • చార్‌ ధామ్ దేవ‌స్థానం బోర్డును ర‌ద్దు చేసిన ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం
  • 2019 లో ఏర్పాటైన చార్‌ ధామ్ దేవ‌స్థానం బోర్డ్‌
  • అన్ని అంశాల‌ను అధ్య‌య‌నం చేశాక.. చార్‌ ధామ్ దేవ‌స్థానం బోర్డు చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకున్నం
  • ఉత్త‌రాఖండ్ సీఎం పుస్క‌ర్ సింగ్ ధామి వెల్లడి
Chardham Devasthanam board : చార్‌ ధామ్ దేవ‌స్థానం బోర్డు ర‌ద్దు

Uttarakhand government withdraws Chardham Devasthanam board Bill: ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం చార్‌ ధామ్ దేవ‌స్థానం బోర్డును ర‌ద్దు చేసింది. ఈ విష‌యాన్ని ఉత్త‌రాఖండ్ సీఎం పుస్క‌ర్ సింగ్ ధామి ( Pushkar Singh Dhami) వెల్లడించారు. అన్ని అంశాల‌ను అధ్య‌య‌నం చేశాక.. చార్‌ ధామ్ దేవ‌స్థానం బోర్డు చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకున్నట్లు ఆయ‌న తెలిపారు. కాగా చార్‌ ధామ్ దేవ‌స్థానం (Chardham Devasthanam) బోర్డ్‌ 2019 లో ఏర్పాటైంది. ఈ బోర్డును ర‌ద్దు చేయాల‌ంటూ చాలా కాలంగా స్థానిక పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఆల‌యాల సంప్ర‌దాయ హ‌క్కులను ఈ బోర్డ్‌ అడ్డుకుంటోందని వారి ఆరోపణ. 

అయితే దేవ‌స్థానం బోర్డుపై (Devasthanam board) ఉన్న‌త స్థాయి క‌మిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అన్ని అంశాల‌ను అధ్య‌య‌నం చేశాక.. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఉత్త‌రాఖండ్ ప్రభుత్వం చివరకు ఈ నిర్ణ‌యం తీసుకుంది.

Also Read : Parag Agrawal Salary: ట్విట్టర్ కొత్త సీఈఓ పరాగ్ అగర్వాల్ సాలరీ ఎంతో తెలుసా?

2019లో మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హయాంలో ఈ బోర్డు ఏర్పాటైంది. ఉత్తరాఖండ్ లోని 51 ఆలయాల (51 temples) వ్యవహారాలను ఈ బోర్డు నిర్వహించేంది. కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్‌, య‌మునోత్రి, గంగోత్రీ తదితర ఆల‌యాలు కూడా ఆ బోర్డు ప‌రిధిలోనే ఉండేవి. ఇక ఈ నిర్ణయంపై చార్‌ ధామ్‌ (Chardham) పూజారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రక నిర్ణయమని.. చార్‌ ధామ్‌ తీర్థ పురోహిత్.. బ్రజేష్ సతి పేర్కొన్నారు.

Also Read : Sirivennela: చేంబోలు సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఎలా మారారు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News