Vinod Dua: కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్​ వినోద్​ దువా మృతి

Vinod Dua: ప్రముఖ జర్నలిస్ట్‌ వినోద్‌ దువా (67) శనివారం కన్నుమూశారు. ఇటీవల కొవిడ్ బారిన పడిన ఆయన..ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 08:05 PM IST
Vinod Dua:  కరోనాతో ప్రముఖ జర్నలిస్ట్​ వినోద్​ దువా మృతి

Veteran journalist Vinod Dua: ప్రముఖ జర్నలిస్ట్​ వినోద్​ దువా(67) దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన కాలేయవ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల దువాకు కరోనా(Covid-19) సోకడంతో..దిల్లీలోని అపోలో ఆస్పత్రిలో  చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన భార్య పద్మావతి సైతం కరోనాతో జూన్​లో మరణించారు. 

Also Read: Actor Shivaram: ప్రముఖ కన్నడ నటుడు శివరామ్ కన్నుమూత

దువా(Journalist Vinod Dua) మరణవార్తను సోషల్ మీడియా(Social Media) వేదికగా వెల్లడించారు ఆయన కుమార్తె, నటి మల్లికా దువా(Malika Dua). తన తండ్రి అంత్యక్రియలను దిల్లీలోని లోధిలో ఆదివారం నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. భారత్‌లోని టీవీ జర్నలిజంలో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వినోద్‌.. దూరదర్శన్, ఎన్టీడీవీ, ది వైర్‌ వంటి జాతీయ మీడియా ఛానెల్స్‌తో కలిసి పనిచేశారు. జర్నలిజంలో ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం 2008లో పద్మశ్రీ పురస్కారం అందించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News