Man carries wife to hospital in cart: ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ఓ వ్యక్తి లాగుడు బండిపై ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను రిఫర్ చేశారు. ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడం.. చేతిలో డబ్బులు లేకపోవడంతో... భార్యను అక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలో అతనికి తోచలేదు. దాదాపు ఐదు గంటల తర్వాత ఎట్టకేలకు ఓ మినీ ట్రక్కును తీసుకొచ్చాడు. కానీ అప్పటికే భార్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన కాసేపటికే ఆమె మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జిల్లాలోని అందౌర్ గ్రామానికి చెందిన సకుల్ ప్రజాపతి అనే వ్యక్తి ఇటీవల తన భార్య (55) అనారోగ్యానికి గురవడంతో... లాగుడు బండిలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ ఆమెకు కొన్ని మందులు రాసిచ్చిన వైద్యులు... జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఏర్పాటు చేయలేదు. చేతిలో డబ్బులు కూడా లేకపోవడంతో అక్కడి నుంచి 15 కి.మీ దూరంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఎలా వెళ్లాలో అతనికి తోచలేదు. ఎట్టకేలకు ఐదు గంటల తర్వాత ఓ మినీ ట్రక్కును తీసుకొచ్చాడు.
ఆపై భార్యను ఆ ట్రక్కులో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందిన కొద్దిసేపటికే అతని భార్య మృతి చెందింది. సకాలంలో ఆసుపత్రికి తరలించకపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సకుల్ ప్రజాపతి లాగుడు బండిపై తన భార్యను ఆసుపత్రికి తరలించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో... అది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం బ్రజేష్ పాతక్.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
Also Read: Hyderabad Drugs Case: ఆ 'మూడు టేబుళ్ల'పై ఫోకస్... కూపీ లాగుతున్న పోలీసులు
Also Read: Channels block: నకిలీ వార్తలు ప్రసారం.. 22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook