పర్సనల్ లోన్ ... కాలాలతో, సంక్షోభాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ డిమాండ్‌లో ఉండేది ఏదైనా ఉందా అంటే అది పర్సనల్ లోన్ ( Personal Loan ) అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. చిన్న చిన్న అవసరాల నుంచి మొదలుకుని పెద్ద పెద్ద అవసరాల వరకు, పెళ్లి లాంటి శుభకార్యాలు ( Personal loan for wedding ) మొదలుకుని ఇంట్లో ఏదైనా వస్తు సామాగ్రి కొనుగోలు చేసే వరకు.. ఆర్థిక అవసరాలు ఎలాంటివి అయినా.. అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పర్సనల్ లోన్. పైగా ఎవ్వరి గ్యారెంటీ ( collateral security ) అవసరం లేకుండా, ఏ ఆస్తిని తనఖా ( Mortgage ) పెట్టకుండా ఇచ్చేది కూడా కేవలం పర్సనల్ లోన్ ఒక్కటే. కరోనావైరస్ సంక్షోభం ( Coronavirus crisis ) సమయంలో పర్సనల్ లోన్స్‌కి అప్లై చేసేందుకు అవసరాలు కూడా అంతే ఎక్కువయ్యాయి. ఐతే, ఈ పర్సనల్ లోన్‌కి అప్లై ( How to apply for personal loan ) చేయడానికి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ? Also read : Hair fall control, Dandruff: జుట్టు రాలడం: చుండ్రు వల్ల జుట్టు రాలుతుందా ?
Personal Loans కావాలంటే ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టుగా ఆస్తి పత్రాలు పెట్టాల్సిన అవసరం లేదు. మరొకరి గ్యారెంటీ సంతకంతో పనిలేదు. కాకపోతే.. పర్సనల్ లోన్‌కి అప్లై చేయగానే బ్యాంకులు ముందుగా చూసేది దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్ ( CIBIL score ) ఎలా ఉందనేదే. అందుకే పర్సనల్ లోన్‌కి అప్లై చేయడానికి ముందుగా మీరు ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంటి ? సిబిల్ స్కోర్ ఎలా చూస్తారు అనే అంశాల గురించి తెలుసుకుంటే మంచిది. ఆ మాటకొస్తే... సిబిల్ స్కోర్ ఒక్క పర్సనల్ లోన్‌కి మాత్రమే తప్పనిసరి కాదు... మీరు ఎటువంటి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా, దరఖాస్తుదారుడి ఆర్థిక పరిస్థితులు ఏంటి ? వారి ఆర్థిక స్థోమత ఏంటి అనే అంశాలు తెలుసుకునేందుకు బ్యాంకులు ముందుగా చూసేది ఈ సిబిల్ స్కోర్‌నే అనేది తెలుసుకోవాల్సిన విషయం. Also read : Sanitizers: శానిటైజర్స్ అతిగా వాడుతున్నారా ? ఐతే ఇది చదవండి
What is CIBIL score ? సిబిల్ స్కోర్ అంటే ఏంటి ?
సిబిల్ అనే పదానికి పూర్తి పేరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ( Credit Information Bureau India Limited or CIBIL ). మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు ఉపయోగించే పద్ధతినే సిబిల్ స్కోర్ అంటారు. గతంలో మీరు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన తీరు ( Repayment of loans ), మీ క్రెడిట్ కార్డు బిల్లులను తిరిగి చెల్లించిన తీరు ( Repayment of credit card bills), తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే క్రమంలో ఎప్పుడైనా విఫలమయ్యారా ? మీరు ఇచ్చిన చెక్ ఎప్పుడైనా బౌన్స్ ( Check bounce ) అయిందా ? అనే అంశాల ఆధారంగా ఈ సిబిల్ స్కోర్ నిర్ణయిస్తారు. ఇందులో మినిమం స్కోర్ 300 కాగా మ్యాగ్జిమం స్కోర్ 900 అలా ఉంటుంది. ఎంత ఎక్కువ స్కోర్ వస్తే మీకు రుణం పొందడానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎంత తక్కువ స్కోర్ వస్తే.. మీ దరఖాస్తు చేస్తున్న రుణం రిజెక్ట్ అవడానికి అన్ని ఛాన్సెస్ ఉంటాయి. మీకు నెలానెలా వచ్చే ఆదాయం, వేతనం ( Income / Salary ) ఎంత ? ఆదాయంలోంచి వ్యయం ( Expenses ) పోగా తిరిగి రుణం చెల్లించే పరిస్థితి ఉందా లేదా అనే అంశాలన్నింటినీ బ్యాంకులు పరిశీలిస్తాయి. Also read :
What is the minimum CIBIL score for personal loan ? పర్సనల్ లోన్ కావాలంటే సిబిల్ స్కోర్ కనీసం ఎంతుండాలి ?
పర్సనల్ లోన్ కావాలంటే కనీసం 750 సిబిల్ స్కోర్ ఉండాలి. అంతకంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే, మీరు చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు అయినా గురవుతుంది లేదా సాధారణ స్థాయి వడ్డీ రేటు ( Personal loan interest rates ) కంటే ఎక్కువ వడ్డీ రేటు ( Interest rates ) వసూలు చేయడం జరుగుతుంది. Also read : Coronavirus: కరోనావైరస్ నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా ?
How to check your CIBIL score ? సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం ఎలా ?
చాలామంది రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తారు కానీ సిబిల్ స్కోర్ ఎలా వస్తుందో ఏమో అనే భయం వారిని వెనక్కి లాగేస్తుంది. అలాగని సిబిల్ స్కోర్ ఎలా తెలుసుకోవాలా అంటే అది అందరికీ అందుబాటులో ఉండేది కాకపోవడంతో సిబిల్ స్కోర్ ఎలా తెలుసుకోవాలా అని ఆందోళనకు గురవుతుంటారు. ఐతే సిబిల్ స్కోర్ తెలుసుకోవడం కోసం ఆన్‌లైన్‌లో కొన్ని ఫైనాన్షియల్ సంస్థలు సేవలు అందిస్తుంటాయి ( How to apply for CIBIL score ). వారి సహాయంతో మీ సిబిల్ స్కోర్ ఏంటో తెలుసుకోవచ్చు. లేదంటే నేరుగా రుణానికి దరఖాస్తు చేసుకున్నట్టయితే, వారి ద్వారా కూడా సిబిల్ స్కోర్ తెలుసుకోవచ్చు. Also read : Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు