కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్లేట్ కడిగారు. ఆయనతో పాటు సోనియా గాంధీ కూడా ప్లేట్ కడిగారు.
వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ వార్ధాలో పర్యటించారు. వార్ధా పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీ సేవాశ్రమ్ ఆశ్రమాన్నిసందర్శించారు. ఆయనతో పాటు మాజీ కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు తదితరులు బాపూ ఆశ్రమాన్ని సందర్శించారు.
ఈ క్రమంలో మధ్యాహ్నం సమయం కావడంతో అక్కడే భోజనం చేశారు కాంగ్రెస్ నేతలందరూ. రాహుల్, సోనియా, మన్మోహన్ సింగ్ కూడా అక్కడే లంచ్ చేశారు. లంచ్ అనంతరం తిన్న ప్లేట్లను వారు కడిగి శుభ్రం చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లంచ్ చేశాక కొళాయి వద్దకి వచ్చి ప్లేట్లు కడిగారు. అనంతరం రాహుల్ గాంధీ జాతిపిత 150వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నిర్వహించే పాదయాత్రలో పాల్గొన్నారు.
వార్దా పర్యటనకు వెళ్లే ముందు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ కేవలం శిలా విగ్రహం కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. నిజమైన దేశభక్తులు మహాత్ముడి విలువలను కాపాడాలని అన్నారు. దేశమంతా విస్తరించి ఉన్న నైతిక విలువలు, ఆలోచనలు, సత్యం, అహింస.. వీటి కోసమే గాంధీజీ జీవించారని, దేశ కోసం ప్రాణాలర్పించారని.. అవే మన దేశానికి పునాది అని రాహుల్ ట్విట్టర్లో అన్నారు.
#WATCH: Sonia Gandhi and Rahul Gandhi wash their plates after lunch in Sevagram (Bapu Kuti) in Wardha. #Maharashtra pic.twitter.com/hzC3AGe7kj
— ANI (@ANI) October 2, 2018