Weather Report: దేశవ్యాప్తంగా విచిత్రమైన వాతావరణ పరిస్థితి.. ఇక్కడ వానలు అక్కడ ఎండలు..

Weather Report: దేశవ్యాప్తంగా ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో వానలు పడుతుంటే.. ఉత్తరాదిలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 24, 2024, 09:22 AM IST
Weather Report: దేశవ్యాప్తంగా విచిత్రమైన వాతావరణ పరిస్థితి.. ఇక్కడ వానలు అక్కడ ఎండలు..

Weather Report: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిత్ర, విచిత్రమైన వాతావరణ పరిస్థితలు నెలకొన్నాయి. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. దీంతో దేశ వ్యాప్తంగా రోళ్లు పగిలే ఎండలు ఉండన్నాయి. ఆ తర్వాత వచ్చే మృగశిర కార్తెతో వానకాలం ప్రారంభం అవుతోంది. కానీ ఈ సారి దేశ వ్యాప్తంగా ఏప్రిల్‌లోనే మాడు పగిలే ఎండలు ప్రజలను ఉక్కిరి బిక్కిర చేసాయి. కానీ మే నెలలో తెలంగాణ, ఏపీ సహా కొన్ని ప్రాంతాల్లో రెండు వారాలు ఎండలు దంచి కొట్టాయి. ఆ తర్వాత అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతంతో ప్రజలు ఊపిరి పీల్చకున్నారు. ప్రస్తుతంలో ఏపీలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ఈశాన్య దిశగా ప్రయాణం చేస్తే ఏపీ తీరానికి దూరంగా కదులులోంది. నిన్ననే తీవ్ర అల్పపీడనంగా బటపడింది. శుక్రవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ తూర్పు, మధ్య బంగాళఖాతంలో తుపానుగా బలపడనుంది. ఇక ఆది, సోమవారాల్లో ఒడిషా, పశ్చిమ బెంగాల్, మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

మరోవైపు గురవారం కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. తిరువంతపురం, కొచ్చిన్, త్రిశ్శూర్, కోడికోడ్ సహా పలు ప్రాంతాల్లో తోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఈ సందర్భంగా వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
 
మరోవైపు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భానుడి ప్రతాపం ఇంకా కొనసాగుతూనే ఉంది. గురువారం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచాయి. పంజాబ్, గుజరాత్, హరియాణ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు వడగాలులు కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భానుడి ప్రతాపం ఇంకా కొనసాగుతోంది. గురువారం కూడా పలు రాష్ట్రాల్లో వడగాలులు వీచాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని కనీసం 16 ప్రాంతాల్లో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువగా నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. రాజస్థాన్‌లోని బాడ్‌మేడ్‌లో అత్యధికంగా 48.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజులపాటు వడగాలుల ముప్పు కొనసాగుతుందని పేర్కొంది. దిల్లీలో మాత్రం గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత స్వల్పంగా తగ్గినట్లు తెలియజేసింది.

  Also Read: Mohanlal: క్రేజీ బ్లాక్ బస్టర్‌ సీక్వెల్‌లో జాతీయ ఉత్తమ నటుడు మోహన్‌లాల్.. ఫస్ట్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News