Viral news: పశ్చిమ బెంగాల్‌లోని నిరుపేద కుటుంబానికి చెందిన 16 ఏళ్ల అమ్మాయి స్మార్ట్‌ఫోన్ కొనడానికి తన రక్తాన్ని అమ్మేందుకు కూడా వెనుకాడలేదు. ఈ ఘటన దినాజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. తపన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్దా ప్రాంతానికి చెందిన ఓ బాలిక 12వ తరగతి చదువుతుంది. అందరిలాగే తాను కూడా స్మార్ ఫోన్ కొనాలని భావించింది. అనుకున్నదే తడువుగా రూ.9000 విలువైన మెుబైల్ ఫోన్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టింది. అయితే పేద కుటుంబానికి చెందిన ఆమె ఇంత డబ్బు ఏర్పాటు చేయడం చాలా కష్టం. అయితే మెుబైల్ వచ్చే లోపు ఏదో విధంగా డబ్బు ఏర్పాటు చేయాలనుకుంది. దీనికోసం తన రక్తాన్ని సైతం అమ్మేందుకు సిద్దమైంది.
రక్తాన్ని విక్రయించడానికి సోమవారం జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లింది. అక్కడ ఉన్న అధికారులను కలిసింది. డబ్బులు ఇస్తేనే రక్తం ఇస్తానని చెప్పింది. దీంతో ఆందోళన చెందిన బ్లడ్ బ్యాంక్ అధికారులు చైల్డ్‌లైన్ ఇండియాకు సమాచారం ఇచ్చారు. జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో బాలికను తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ చేశారు.
''ఉదయం 10 గంటలకు ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చింది. జిల్లా ఆసుపత్రికి చెందిన బ్లడ్ బ్యాంక్ కావడంతో రక్తం తీసుకునేందుకు వచ్చిందని మొదట్లో అనుకున్నాం. కానీ ఆమె మాకు రక్తాన్ని విక్రయించాలనుకుంటున్నట్లు చెప్పింది. దీంతో మేము ఒక్కసారిగా షాక్ అయ్యాం'' అని బాలూర్‌ఘాట్ జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ అధికారి కనక్ కుమార్ దాస్ అన్నారు. మొదట్లో ఆమె తన సోదరుడి చికిత్స కోసం తన రక్తాన్ని అమ్మాలనుకున్నట్లు మాకు చెప్పింది. తర్వాత లోతుగా విచారిస్తే ఆమె స్మార్ ఫోన్ కొనడానికి ఇదంతా చేసిందని దాస్ తెలిపారు.
సోమవారం ట్యూషన్‌కు హాజరవుతానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె సైకిల్‌ను బస్టాండ్‌లో పెట్టింది. అక్కడ నుంచి జిల్లాకేంద్ర 30 కిలోమీట్లర్ల దూరం. అక్కడికి వెళ్లేందుకు తపన్లో బస్సు ఎక్కి ఆస్పత్రికి వెళ్లింది. ''“ఆమె బయటకు వెళ్ళినప్పుడు నేను ఇంట్లో లేను. డబ్బు సంపాదించడానికి రక్తాన్ని అమ్మవచ్చు అనే ఆలోచన తనకి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా తెలియదు'' అని ఆమె తండ్రి చెప్పాడు. బాలిక తల్లి గృహణి. ఆమెకు నాలుగో తరగతి చదువుతున్న తమ్ముడు కూడా ఉన్నాడు.
Also Read: Viral Video: ఆ వీడియో తీసినందుకు.. ఇద్దరు యువకులను 4 గంటలు చితకబాదిన ఆసుపత్రి నర్సులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook