కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఆ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై మంగళవారం రాత్రి దుండగులు దాడికి పాల్పడ్డారు. రాష్ట్రంలో అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. అదే కాన్వాయ్‌లో దిలీప్ ఘోష్‌తో కలిసి ప్రయాణిస్తోన్న అస్సాం రాష్ట్ర మంత్రి హిమంత విశ్వ శర్మ ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
TMC goons have blocked the roads on both sides, even as West Bengal Police personnel standing like mute spectator.
I am appalled at such brazen abuse of power by @MamataOfficial whose people have thrown all democratic norms to gutter. Is this the #NewIndia that we dream of? pic.twitter.com/BcW5AxLXKa
— Chowkidar Himanta Biswa Sarma (@himantabiswa) May 7, 2019
మమతా బెనర్జి అధికార దుర్వినియోగానికి ఇదో దర్పణం అంటూ ట్వీట్ చేసిన అస్సాం మంత్రి... మనం కలలు కంటున్న నవ భారతం ఇదేనా అని ఆవేదన వ్యక్తంచేశారు.
The @crpfindia personnel are helping us to gradually move away from here. Three .@BJP4Bengal workers are taken away by .@AITCofficial goons in front of police / Kultha Bazar, under PS Khejuri and kept in TMC union office. Goons have damaged 20+ motorbikes.#ShameMamata pic.twitter.com/XT7wWE0Cmn
— Chowkidar Himanta Biswa Sarma (@himantabiswa) May 7, 2019
టీఎంసీ గూండాల దాడిలో బీజేపి కార్యకర్తలు ఎంతో మంది గాయపడ్డారని, తాము ఇక్కడే చిక్కుకుపోయామని హిమంత విశ్వ శర్మ తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ బలగాలు తమను అక్కడి నుంచి తరలించేందుకు సహాయపడ్డారని హిమంత విశ్వ శర్మ తెలిపారు.