Arnab goswami: టీఆర్పీ కుంభకోణం, వైరల్ అవుతున్న అర్నబ్ గోస్వామి వాట్సప్ చాట్

Arnab goswami: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నబ్ గోస్వామి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ వైపు కేసు విచారణలో ఉండగానే...బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తాతో అర్నబ్ జరిపిన వాట్సప్ చాట్  లీకై...వైరల్ అవుతోంది.

Last Updated : Jan 16, 2021, 04:42 PM IST
Arnab goswami: టీఆర్పీ కుంభకోణం, వైరల్ అవుతున్న అర్నబ్ గోస్వామి వాట్సప్ చాట్

Arnab goswami: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నబ్ గోస్వామి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ వైపు కేసు విచారణలో ఉండగానే...బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తాతో అర్నబ్ జరిపిన వాట్సప్ చాట్  లీకై...వైరల్ అవుతోంది.

న్యూస్ ఛానెళ్ల టీఆర్పీ రేటింగ్ ( TRP Rating ) విషయంలో  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అర్నబ్ కేసు ( Arnab case ) ఊహించని మలుపు తిరిగింది. ఓ వైపు ముంబై పోలీసులు ( Mumbai police ) కేసు విచారణ చేస్తున్నారు. మరోవైపు జనవరి 29 వరకూ అర్నబ్ సహా ఇతర ఉద్యోగులపై ఎటువంటి చర్యలు తీసుకోమని ముంబై హైకోర్టు ( Mumbai high court ) కు పోలీసులు హామీ ఇచ్చారు. ఈలోగార్నబ్ గోస్వామి ( Arnab goswami ) చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంది. రిపబ్లిక్ టీవీ ( Republic tv ) ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈఓ పార్థోదాస్ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణలు లీకయ్యాయి. 

ఇరువురి మధ్య జరిగిన వాట్సప్ సంభాషణ ( Whatsapp chat ) ఏకంగా 5 వందల పేజీలకు పైగా ఉంది. ఇవి నిజంగానే తిరుగులేని ఆధారాలంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది. టీఆర్పీకు సంబంధించి అవసరమైతే ప్రధానమంత్రి కార్యాలయం ( PMO ) నుంచి సాయం అందిస్తానని అర్నబ్ గోస్వామి..పార్థోదాస్ గుప్తాకు  హామీ ఇచ్చినట్టు కొన్ని చాట్‌లలో కన్పిస్తోంది. మంత్రులంతా తమవైపే ఉన్నారని మరో చాట్‌లో అర్నబ్ చెప్పినట్టుగా ఉంది. కండీవలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టుగా ఉన్న పీడీఎఫ్ పేజీల్లో ప్రతి పేజీపై పలువురు సంతకాలు కూడా ఉన్నాయి.

ఈ వాట్సప్ సంభాషణను ముంబై పోలీసులే విడుదల చేశారని తెలుస్తోంది. ఒకవేళ ఈ సంభాషణే నిజమైతే అర్నబ్ గోస్వామి మరోసారి చిక్కుల్లో పడక తప్పదు

Also read: Coronavirus Vaccination: అలాంటి వారు వ్యాక్సిన్ తీసుకోవద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News