Ganga Vilas Cruise: ప్రపంచపు అతి పొడవైన నదీ మార్గపు క్రూయిజ్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Ganga Vilas Cruise: ప్రపంచంలోనే అత్యంత పొడవైన మార్గం ప్రయాణించే రివర్ క్రూయిజ్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. వారణాసిలో జెండా ఊపి ప్రారంబించనున్న ఈ రివర్ క్రూయిజ్ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 9, 2023, 10:58 AM IST
  • జనవరి 13న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న గంగా విలాస్ క్రూయిజ్
  • ప్రపంచపు అతి పొడవైన నదీ మార్గపు క్రూయిజ్ ఇదే
  • 51 రోజులు 50 నగరాలు, రెండు దేశాలతో 32 వందల కిలోమీటర్ల ప్రయాణం
Ganga Vilas Cruise: ప్రపంచపు అతి పొడవైన నదీ మార్గపు క్రూయిజ్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

వారణాసి నుంచి ప్రారంభమై..దేశంలని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్ని, బంగ్లాదేశ్‌లోని నదీ వ్యవస్థల్ని చుట్టుకుంటూ ప్రపంచ హెరిటేజ్ ప్రాంతాల్ని సందర్శిస్తూ సాగే రివర్ క్రూయిజ్ పేరు ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్. జనవరి 13న దేశ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.

ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్ మొత్తం 51 రోజుల్లో 3200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తొలి పర్యటన వారణాసిలో జనవరి 13న ప్రారంభం కానుంది. అక్కడి నుంచి బంగాళాఖాతంలోని సుందర్‌బన్స్, కాజీరంగా నేషనల్ పార్క్, ప్రసిద్ధ బౌద్ధ పుణ్యక్షేత్రాలైన సారనాధ్, మయోంగ్, మజులి ద్వీపం మీదుగా సాగుతుంది. బంగ్లాదేశ్‌లోని 27 నదీ వ్యవస్థల మీదుగా ప్రయాణిస్తూ..ప్రపంచ హెరిటేజ్ సెంటర్లు, జాతీయ ఉద్యానవనాలతో 50 పర్యాటక ప్రాంతాలు కవర్ చేస్తూ సాగుతుంది. 

బీహార్‌లోని పాట్నా, జార్ఘండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సోంలోని గువహతి వంటి 50 ప్రధాన నగరాల మీదుగా క్రూయిజ్ పర్యటన ఉంటుంది. జనవరి 13న ప్రారంభమై..మార్చ్1వ తేదీన దిబ్రూఘర్‌లో ముగుస్తుంది. దేశంలో ప్రస్తుతం వారణాసి-కోల్‌కతా మధ్య 8 రివర్ క్రూయిజ్‌లు నడుస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక దూరం నదీ ప్రయాణం చేసే నౌక ఇదే కానుంది. తొలి పర్యటనలో 32 మంది స్వట్జర్లాండ్ దేశానికి చెందిన విదేశీ పర్యాటకులున్నారు. 

Also read: Akhilesh Yadav Tea: పోలీసులు ఇచ్చిన టీ తాగనన్న అఖిలేష్...విషం అనుమానం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News