ఈసారి 9-12 శాతం వేతన పెంపు ఉండొచ్చు

ఈ ఏడాది దేశంలోని ప్రవేట్ ఉద్యోగులకు సగటున 9-12 శాతం వేతన పెంపు ఉంటుందని అవన్ హెచ్ ఆర్ కన్సల్టెన్సి కంపెనీ తెలిపింది.

Last Updated : Apr 16, 2018, 12:21 AM IST
ఈసారి 9-12 శాతం వేతన పెంపు ఉండొచ్చు

ఈ ఏడాది దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు సగటున 9-12 శాతం వేతన పెంపు ఉంటుందని అవన్ హెచ్ ఆర్ కన్సల్టెన్సి కంపెనీ తెలిపింది. నైపుణ్యాలున్న వారికే అధిక ప్రాధాన్యత ఇచ్చేలా కంపెనీల ఆలోచనలు మారుతున్న నేపథ్యంలో.. వారికి 15 శాతం పెంపు ఉండవచ్చని పేర్కొంది. ఎఫ్ఎంసీజీ, రిటైల్, మీడియా, ప్రకటనల రంగాల్లో అధిక పెంపు ఉంటుందట. ఇక వృత్తి నైపుణ్యాలు అధికంగా ఉన్నవారని ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు పంపేందుకు ఇష్టపడటం లేదట.

"2016-17లో నోట్ల రద్దు ప్రభావం, ఆతరువాత  2017-18లో జీఎస్టీ దెబ్బతో వ్యాపారం నెమ్మదించిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు, భారత ఆర్థిక వ్యవస్థ,  జాబ్ మార్కెట్‌లు పుంజుకున్నాయి" అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018-19) అన్ని రంగాలకు చాలా సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం అని అంటున్నారు నిపుణులు. 

ఉద్యోగుల నియామకాల్ని చేపట్టి ఆయా రంగాల్లో నైపుణ్యాలున్న  వారిని ఎంపిక చేసుకొనేలా కంపెనీలు కోరుకుంటున్నాయని ఓ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది.  ముంబై, పుణె, చెన్నై, హైదరాబాద్‌లతో పోల్చితే  బెంగుళూరు, ఢిల్లీ నగరాల్లో వేతన పెంపు అధికంగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద ఈ ఆర్థిక సంవత్సరంలో బహుళజాతి సంస్థలతో పాటు స్టార్టప్ కంపెనీలు రెండూ కూడా 10-15 శాతం వరకు వేతనాలను పెంచవచ్చని డాక్టర్ ఇంస్టా ఫౌండర్, సిఈవో అమిత్ ముంజాల్ అన్నారు.

Trending News