Acharya Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో జీవితాలకు ఉపయోగపడే పలు విషయాల గురించి చాలా క్లుప్తంగా చెప్పాడు వీటిని వీటిని పాటిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలు సులభంగా దూరం చేసుకోవచ్చు. చాణక్య నీతి శాస్త్రంలో భార్యాభర్త, సంపద, ఆస్తి, వైవాహిక జీవితం మొదలైన అంశాల గురించి చాలా క్లుప్తంగా వివరించారు. చాణక్య నీతి ప్రకారం వీటిని పాటించడం వల్ల ఉన్నత శిఖరాల్లోకి ఎదగొచ్చని శాస్త్రం ద్వారా తెలిపారు.
చాణక్య నీతి శ్లోకం:
న విప్ర పాదోదక కర్దమాని
న వేదశాస్త్ర ధ్వని గర్జితాని |
స్వాహా స్వధాకార వివర్జితాని
శ్మశాన తుల్యాని గృహాణి తాని ||
నీరు, ఆహారం:
భూమిపై లభించే వజ్రాలు వైడూర్యాలు రత్నాలు అన్ని ఎంతో విలువైనది. కానీ వీటి విలువ బంగారానికి పెట్టినప్పుడే తెలుస్తుంది. అయితే భూమి మీద అధిక శాతం నీరు ఉంది. ఇందులో తాగే నీరు కేవలం 10 శాతమే.. కాబట్టి నీరు లేకుండా మానవ జీవితం సాధ్యం కాదు. మనిషి జీవితానికి నీరుతో పాటు ఆహార పదార్థాలు కూడా ఎంతో అవసరం. కొన్ని సందర్భాల్లో వజ్రాలు, బంగారమే కాకుండా నీరు కూడా ఉపయోగపడుతుంది.
మధురమైన మాటలు:
నీరు ఆహారం ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడతాయి. శరీరానికి పోషణ అందిస్తాయి.. శక్తి తెలివితేటలను కూడా పెంచుతాయి. వీటితో పాటు మధురమైన మాటలు కూడా వ్యక్తి జీవితానికి చాలా అవసరం. మాటలతో శత్రువులను కూడా జయించిన రాజులున్నారు. అందుకే రత్నం విలువ కంటే మాట విలువ గొప్పదని పూర్వీకులు అనేవారు. చాణక్యుడు కూడా తన నీతి శాస్త్రంలో మాటలకు చాలా విలువలనిచ్చారు.
గాయత్రి మంత్రం:
ఆచార్య చాణక్యుడు గాయత్రి మంత్రానికి చాలా ప్రాధాన్యతను ఇచ్చాడు. గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైనదని కూడా అభివర్ణించాడు. గాయత్రీని వేదమాతగా ఆచార్య నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. దానధర్మం కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదని.. కాబట్టి ప్రతి ఒక్కరూ దానధర్మాలు చేయాలని శాస్త్రం ద్వారా సూచించాడు. ముఖ్యంగా అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని చాణక్య నీతి శాస్త్రం ద్వారా తెలిపారు.
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook