Belly Fat Tips: ఇవి తింటే చాలు.. పొట్ట తగ్గిపోవడం ఖాయం

Belly Fat Remedies : బరువుతగ్గుతున్నా పొట్ట మాత్రం తగ్గించలేకపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. పొట్ట తగ్గించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఎనిమిది వారాలపాటు ఈ ఆహారం తీసుకుంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు సులువుగా కరిగిపోతుంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 12, 2024, 11:11 PM IST
Belly Fat Tips: ఇవి తింటే చాలు.. పొట్ట తగ్గిపోవడం ఖాయం

Foods to reduce belly fat : చాలామంది బరువు తగ్గాలి అనుకున్నా అనుకోకపోయినా పొట్ట మాత్రం తగ్గించాలని అనుకుంటూనే ఉంటారు. దానికి తగ్గట్టు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ అన్నీ వర్కౌట్ అవ్వవు. ముఖ్యంగా బరువు తగ్గినా కూడా పొట్ట మాత్రం తగ్గని వాళ్ళు చాలామంది ఉన్నారు. అధిక బరువు కంటే పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. 

పొట్ట చుట్టూతా ఉండే కొవ్వు వల్ల డయాబెటిస్, హై బీపీ, గుండెపోటు వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కానీ కేవలం డైటింగ్ చేసినంత మాత్రాన పొట్ట తగ్గదు. ఎంత తిండి మానేసి కూర్చుని పొట్ట తగ్గించినా కూడా మళ్ళీ తినడం మొదలుపెట్టగానే పొట్ట పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వారి కోసమే కొన్ని అద్భుతమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. పొట్ట తగ్గించే ఎక్సర్సైజ్ లతో పాటు కొన్ని ఆహార పదార్థాలు మన డైట్ లో చేర్చుకోవాలి. 

బాదంపప్పు : 

బాదం పప్పులలో ఉండే కొవ్వు ఆరోగ్యకరమైనది. మోనో అన్ సాచ్యురేటెడ్, పోలీ అన్ సాచ్యురేటెడ్ ఫాట్స్ బాదంపప్పులో ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉండే బాదంపప్పు వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి కూడా వేయదు. కానీ బాదంపప్పు తొక్క తీసి తింటే చాలా మంచిది.

పుచ్చకాయ :

పుచ్చకాయలో 90 శాతం నీళ్లు ఉంటాయి. అందుకని పుచ్చకాయ ముక్కలను భోజనానికి కొంచెం ముందు తీసుకుంటే ఎక్కువ ఆహారం తిన బుద్ధి కాదు. అయినప్పటికీ పుచ్చకాయలో ఉండే బి,సి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియమ్ కంటెంట్లు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. 

బీన్స్ :

బీన్స్ లో అన్ని రకాలు పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ ని తగ్గిస్తాయి. అందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల బీన్స్ ని ఆహారంలో యాడ్ చేసుకోవడం వల్ల త్వరగా బరువుతగ్గిపోవచ్చు.

సెలరీ:

ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో ఉండే విటమిన్ సి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ను కరిగిస్తుంది. రోజుకి ఒక గ్లాసు సెలరీ జ్యూస్ తాగితే పొట్టలో ఉన్న వ్యర్ధాలు మాత్రం మొత్తం బయటకు వచ్చేస్తాయి. రోజు ఈ జ్యూస్ తాగడం వల్ల మహిళల్లో ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దోసకాయ:

దోసకాయలో చాలా శాతం నీళ్లు ఉంటాయి. దోసకాయతో సలాడ్ తింటే కూడా అది డీటాక్స్ గా పని చేస్తుంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా క్లీన్ అవుతుంది. 

టమాటా:

టమాటా మన రక్తంలో ఉండే లిపిడ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఒబేసిటీ సమస్యల నుంచి కూడా దూరం చేస్తుంది. టమాటా ని పచ్చిగా తిన్నా లేదా వండుకొని తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. టమాట వల్ల ముఖంలో కూడా గ్లో వస్తుంది. 

అవకాడో:

రోజూ ఐదారు ముక్కల అవకాడో తినడం వల్ల ఆకలి కూడా తగ్గిపోతుంది. అయితే ఏదైనా అతిగా తినకూడదు అంటారు కానీ ఆవకాడో ఎంత తిన్నా ఎటువంటి సమస్య ఉండదు.

ఆపిల్ : 

రోజుకి ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం రాదు అని వింటూనే ఉంటాం. అది నిజమే. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మనకి ఎంతో మేలు చేస్తాయి. ఆపిల్ తినడం వల్ల పొట్ట ఫుల్ గా అనిపిస్తుంది. అంతేకాకుండా కాలన్ క్యాన్సర్ ను కూడా అడ్డుకునే శక్తి ఆపిల్ లో ఉంది. 

 పైనాపిల్ :

సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా ఆరోగ్యానికి మంచిదే. పైనాపిల్ కూడా జీర్ణ సమస్యలను త్వరగా తీర్చేస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు చాలా మెరుగుపరడంతో పాటు పైనాపిల్ పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ ను కూడా కరిగిస్తుంది.

Read more: Election commission: పోలింగ్ సిబ్బందికి ఈసీ అందించే ఫుడ్ మెనూ ఏంటో తెలుసా..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News