Skin Care: ఇంట్లో ఉన్న మూడు పదార్థాలతో ఫేషియల్.. ఈ ప్యాక్ తో అందమైన ముఖం మీ సొంతం..

Skin Brightening Pack : ఎన్నో కారణాల వల్ల ముఖం మీద పింపుల్స్ పోయాక కూడా డార్క్ స్పాట్స్ ఉండిపోతాయి. కానీ ఒకే ఒక్క ఫేస్ ప్యాక్ తో ఈ మచ్చలు పోతాయి. ఇంట్లో ఉండే మూడే మూడు పదార్థాలతో ఈ అద్భుతమైన ఫేస్ ప్యాక్ ను మనం రెడీ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.  

Last Updated : Apr 25, 2024, 03:57 PM IST
Skin Care: ఇంట్లో ఉన్న మూడు పదార్థాలతో ఫేషియల్.. ఈ ప్యాక్ తో అందమైన ముఖం మీ సొంతం..

Skin Brightening Pack : ఎండ వల్ల ఎక్కువగా చెమటలు పట్టడం, మొహం జిడ్డుగా అయిపోతూ ఉండటం, పొల్యూషన్, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో రకాల కారణాలవల్ల మొహం మీద మొటిమలు వస్తూ ఉంటాయి. కొన్నాళ్ళకి మొటిమలు తగ్గినప్పటికీ వాటి వల్ల వచ్చిన మార్క్స్ మాత్రం అలానే మిగిలిపోతాయి. కానీ నల్ల మచ్చలు ఎక్కువ అవుతున్నాయి అని ఫేషియల్ అనీ , ట్రీట్మెంట్ అంటూ పార్లర్లు లేదా హాస్పిటల్స్ చుట్టూ తిరిగే కంటే ఇంట్లో ఉండే వస్తువులతో కూడా మనం సులువుగా ముఖంపై మచ్చలని తగ్గించొచ్చు. ఈ చిన్న ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం అందంగా మెరుస్తుంది. అదేంటో తెలుసుకుందాం. 

ఈ ప్యాక్ కోసం మనకి కావాల్సిన పదార్థాలు కేవలం మూడే. 5 ద్రాక్ష పండ్లు, నాలుగైదు చుక్కల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ దోసకాయ రసం.

దోసకాయ రసం చర్మం లో తేమ ను తిరిగి తెస్తుంది. కాబట్టి ముడతలు పోయి స్కిన్ హైడ్రేటెడ్‌గా మారుతుంది. మొహం లేదా కళ్ళు ఉబ్బినా వెంటనే తగ్గించేస్తుంది. చర్మానికి దోసకాయ కొత్త కాంతి ని తెస్తుంది. 

ద్రాక్ష పండ్ల రసం కూడా కాంతివంతమైన చర్మానికి ఎంతో అవసరం. దీని వల్ల చర్మం మెరుస్తుంది. ద్రాక్ష యాంటీ ఏజింగ్‌లా కూడా పనిచేసి సన్ బర్న్ ను తగ్గిస్తుంది.

నిమ్మరసం మన ముఖానికి కూడా ఎంతో మంచిది. అందులో ఉండే కొల్లాజెన్‌  నల్ల మచ్చ లను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అంతేకాకుండా నిమ్మరసం వల్ల ముఖం మీద ఉన్న మొటిమలు కూడా తగ్గుతాయి

ఇక ఎలా తయారు చేసుకోవాలో చూస్తే, ముందుగా ద్రాక్ష పళ్ళను రసం చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో దోసకాయ రసం, కొంచెం నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి. 

ఈ తయారు అయిన మిశ్రమాన్ని ముఖానికి ముఖ్యంగా డార్క్ స్పాట్స్ మీద అప్లై చేసి ఒక 15 నిమిషాల పాటు ఆరిపోయేదాకా అలానే ఉంచాలి. ఆరిపోయాక ఎలాగో వేసవి కాలం కాబట్టి చల్లని నీటితో క్లీన్ చేసుకోవాలి. మొదటిసారి అప్లై చేశాకే మంచి ఫలితం కూడా కనిపిస్తుంది. ఇలా వారానికి కనీసం రెండు సార్లు అయినా చేస్తే మీ చర్మం అందంగా మెరుస్తూ ఉంటుంది. మచ్చలు అన్నీ పోయి మృదువుగా మారుతుంది.

Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News