Benefits Of White Onions: ప్రతిరోజు ఆహారాలు వండుకునే క్రమంలో తప్పకుండా ఉల్లిపాయను వినియోగిస్తారు. ఇవి ఆహారాల రుచిని పెంచడమే కాకుండా శరీరాన్ని కూడా చాలా రకాలుగా సహాయపడతాయి. తరచుగా మార్కెట్లో లభించే ఎర్రని ఉల్లిపాయలను తీసుకుంటూ ఉంటారు. కానీ తెల్లని ఉల్లిపాయలు కూడా ఉంటాయి. వీటిని ఆహారాలు వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే మూలకాలు తీవ్రవ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. మీరెప్పుడైనా తెల్లని ఉల్లిపాయలను చూశారా? వీటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం..
తెల్ల ఉల్లిపాయ ప్రయోజనాలు:
✺ తెల్ల ఉల్లిపాయలో విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం, సోడియం, ఫాస్పరస్, ఫైబర్, ప్రొటీన్, ఫోలేట్ మొదలైన పోషకాలు లభిస్తాయి. వీటితోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల తీవ్ర పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
✺ తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా సలాడ్స్ లో వినియోగించడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల పొట్టలోని బ్యాక్టీరియాను సులభంగా బయటికి పంపిస్తుంది. తరచుగా మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు ఈ తెల్ల ఉల్లిపాయలను వినియోగించాల్సి ఉంటుంది.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
✺ ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి తెల్ల ఉల్లిపాయల రసాన్ని క్రమం తప్పకుండా వెంట్రుకలకు అప్లై చేయాలి. చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు తగ్గడమే కాకుండా బట్టతల సమస్యలకు కూడా సులభంగా చెక్ పెట్టొచ్చని ఆయుర్వేదనలు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు చుండ్రు సమస్యలను కూడా దూరం చేస్తాయి.
✺ తెల్ల ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెపోటు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తెల్ల ఉల్లిపాయలను పచ్చివిగా తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
✺ క్వెర్సెటిన్, ఆంథోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్లు తెల్ల ఉల్లిపాయల్లో అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని ఆహారాల్లో వినియోగించడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ ఉల్లిపాయలను పచ్చివిగా తినాల్సి ఉంటుంది.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook