Benefits of Black Tea For Hair: ప్రతి స్త్రీ తన జుట్టు అందంగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. అయితే వాతావరణ కాలుష్యం కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్ లభించే వివిధ ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయితే దీని వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒత్తైన, దృఢమైన జుట్టు కోసం తప్పకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బ్లాక్ టీ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు:
బ్లాక్ టీ జుట్టు రాలడం, చుండ్రు, వెంట్రుకలు మందంగా, దృఢంగా మారడానికి పర్ఫెక్ట్ రెమెడీ అని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. జుట్టుకు బ్లాక్ టీని ఉపయోగిస్తే చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం మీరు బ్లాక్ టీ స్ప్రేని వినియోగించాల్సి ఉంటుంది.
బ్లాక్ టీతో హెయిర్ స్ప్రేని ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?:
>>బ్లాక్ టీ నుండి హెయిర్ స్ప్రే చేయడానికి, ముందుగా మీరు ఒక కప్పు నీటిని బౌల్‌లో మరిగించాలి. దీని తర్వాత అందులో టీ ఆకులు వేసి ఉడికించాలి.
>>కనీసం స్ప్రే కోసం 30 నిమిషాల పాటు ఉడకబెట్టండి. ఆ తర్వాత దీనిని పక్కన పెట్టి, ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోండి.
>>ఉదయం స్నానం చేయడానికి ముందు జుట్టుకు స్ప్రే చేసి ఆరబెట్టండి.
>>దీన్ని అప్లై చేసిన తర్వాత వేళ్ల సహాయంతో తేలికగా మసాజ్ చేసి జుట్టుకు బాగా పట్టించాలి. ఆ తర్వాత ఓ గంట పాటు జుట్టుకు అలానే ఉంచాల్సి ఉంటుంది.
>>ఇలా ఆరబెట్టిన తర్వాత షాంపుతో శుభ్రం చేస్తే.. సులభంగా జుట్టు పొడవుగా, మందంగా, బలంగా తయారవుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Samantha Ruth Prabhu : నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తోడున్నది అదే : సమంత
Also Read: Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook