Blood Sugar Levels: మధుమేహం ఉన్నవారు వింటర్ మధ్యలో తప్పకుండా పాటించాల్సిన చిట్కాలు..

Blood Sugar Level Control Tips In Winter Season: డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు తప్పకుండా వింటర్లో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వ్యాయామాలు కూడా తప్పకుండా చేయాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2023, 04:13 PM IST
Blood Sugar Levels: మధుమేహం ఉన్నవారు వింటర్ మధ్యలో తప్పకుండా పాటించాల్సిన  చిట్కాలు..

 

Blood Sugar Level Control Tips In Winter Season: చలికాలంలో డయాబెటిస్‌తో బాధపడేవారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక తీసుకోవాలి లేకపోతే రక్తం లోని చక్కర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయి ఇతర వ్యాధులకు కారణమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా శీతాకాలంలో ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలకు కూడా చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది. కొంతమందిలో వీటి కారణంగా కూడా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమంది బాడీ ఫిట్నెస్ కూడా కోల్పోతున్నారు.

శీతాకాలంలో డయాబెటిస్‌తో బాధపడేవారు తప్పకుండా శరీరాన్ని హైబ్రిడ్జ్ గా ఉంచుకొని ఆహారాలు తీసుకోవాలి. దీంతోపాటు ఆల్కహాల్ ఇతర చెడు అలవాట్లు ఉన్నవారు ముఖ్యంగా చలికాలంలో వాటికి దూరంగా ఉండాలి. లేకపోతే మధుమేహం తీవ్రతరంగా మారి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలోనే ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి శరీరాన్ని రక్షించుకోవడానికి తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రోటీన్స్ కలిగిన ఆహారాలు:
చాలామంది చలికాలంలో అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకుంటారు వీటికి బదులుగా శరీరంలోని చక్కెర పరిమాణాలను అదుపులో ఉంచే కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తక్కువ కొవ్వులు ప్రోటీన్లు ఉన్న ఆహారాలు తీసుకోవడం కూడా చాలా మంచిది.. దీని వల్ల రక్తంలోని చక్కెర పరిమాణం నియంత్రణలో ఉంటాయి.

తృణధాన్యాలు:
చలికాలంలో మధుమేహంతో బాధపడుతున్న వారికి రుణ ధాన్యాలతో తయారుచేసిన ఆహారాలు శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడితే తప్పకుండా తృణధాన్యాలు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

వ్యాయామాలు చేయాలి:
మధుమేహం ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో వ్యాయామాలు చేయడం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఆహారాలు తీసుకోవడమే కాకుండా గంట చొప్పున వ్యాయామాలు కూడా చేయాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రించుకోవచ్చు. 

డైట్ ప్లాన్ తప్పనిసరి:
డయాబెటిస్‌తో బాధపడేవారు ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటున్నారు. ఇక నుంచి ఇలా తీసుకోవడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు కేవలం డైట్ పద్ధతిలోనే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News