Butter Chicken Recipe In Telugu: చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చికెన్ ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. ప్రతి ఒక్కరు వారంలో ఒకరోజైనా చికెన్ ను ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. అయితే దీనిని ఒక్కొక్క ప్రాంతం వారు ఒకలా తయారు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా తెలంగాణ విషయానికొస్తే, చాలామంది నాటుకోడి చికెన్ అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఆంధ్రాలోనైతే చికెన్ గోంగూర వివిధ చికెన్ రెసిపీలను తయారు చేసుకుని తింటారు. ఇక ఉత్తర భారత దేశంలోనైతే కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు బటర్ చికెన్(Butter chicken), చికెన్ పన్నీర్ వంటి రెసిపీలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా క్రమం తప్పకుండా చికెన్‌ను పిల్లలకు ఇవ్వడం వల్ల చాలా రకాల శరీర ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన తగిన పోషకాలు ఉంటాయి. కాబట్టి బాడీ పెరుగుదలను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కూడా దోహదపడతాయి. అయితే చాలామంది రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ తయారు చేసుకోవాలని అనుకుంటారు. కానీ కొన్ని కారణంగా తయారీ పద్ధతిలో లోపాలు ఏర్పడి కూర రుచిని కోల్పోతారు. అయితే మేము అందించిన స్టైల్లో తయారు చేసుకుంటే రుచికరమైన బట్టర్ చికెన్ పొందడం ఖాయం.
బటర్ చికెన్(Butter chicken) రెసిపీకి కావలసిన పదార్థాలు:
❁ 1 కిలో బోన్‌లెస్ చికెన్
❁ 2 టేబుల్ స్పూన్ల పెరుగు
❁ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
❁ 1 టీస్పూన్ కారం పొడి
❁ 1 టీస్పూన్ గరం మసాలా
❁ 1/2 టీస్పూన్ మిరప పొడి
❁ 1/4 టీస్పూన్ పసుపు
❁ 1/4 టీస్పూన్ జీలకర్ర పొడి
❁ 1/4 టీస్పూన్ ధనియాల పొడి
❁ ఉప్పు రుచికి సరిపడా
❁ నూనె
మసాలా తయారీకి పదార్థాలు:
❁ 2 టేబుల్ స్పూన్ల వెన్న
❁ 1 టేబుల్ స్పూన్ నూనె
❁ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
❁ 1 టీస్పూన్ కారం పొడి
❁ 1 టీస్పూన్ గరం మసాలా
❁ 1/2 టీస్పూన్ మిరప పొడి
❁ 1/4 టీస్పూన్ పసుపు
❁ 1/4 టీస్పూన్ జీలకర్ర పొడి
❁ 1/4 టీస్పూన్ ధనియాల పొడి
❁ 1/2 టీస్పూన్ కసూరి మెంతులు
❁ 1/2 టీస్పూన్ యాలకుల పొడి
❁ 1/2 టీస్పూన్ లవంగాల పొడి
❁ 1/4 టీస్పూన్ జాజికాయ పొడి
❁ ఉప్పు రుచికి సరిపడా
❁ 1/2 కప్పు పెరుగు
❁ 1/2 కప్పు క్రీమ్
తయారీ విధానం:
❁ ముందుగా చికెన్ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని అందులో వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
❁ చికెన్ ముక్కలను పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, గరం మసాలా, మిరప పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పుతో కలిపి బాగా మెరినేట్ చేసుకోవాలి.
❁ ఇలా మెరినేట్ చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత మరో రెండు నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.
❁ ఒక పాన్‌లో నూనె వేడి చేసి, మెరినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి బాగా వేయించాలి.
❁ మరొక పాన్‌లో వెన్న, నూనె వేడి చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
❁ తరువాత కారం పొడి, గరం మసాలా, మిరప పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
❁ కసూరి మెంతులు, యాలకుల పొడి, లవంగాల పొడి, జాజికాయ పొడి, ఉప్పు వేసి కలపాలి.
❁ పెరుగు, క్రీమ్ వేసి బాగా కలపాలి.
❁ ఈ మసాలాను వేయించిన చికెన్ ముక్కలలో వేసి బాగా కలపాలి.
❁ ఆ తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించి, కొత్తిమీరతో అలంకరించి వేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి